మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానుల మధ్య గత రెండున్నర దశాబ్దాలుగా కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. అభిమానుల మధ్య కోల్డ్ వార్ ఎలా ఉన్నా కూడా చిరు – బాలయ్య ఇటీవల కాలంలో సఖ్యతతోనే ఉంటున్నారు. బాలయ్య 50 ఏళ్ల వేడుకకి చిరు కూడా వెళ్లారు. పైస్థాయిలో చిరు, బాలయ్య ఎలా ఉన్నా అభిమానులు మధ్య సోషల్ మీడియాలో కొట్టేసుకుంటూ ఉంటారు. బాలయ్య ఇటీవల వరుసగా నాలుగు హిట్లు ఇచ్చారు. అఖండతో స్టార్ట్ అయిన ఈ జర్నీ ఇప్పుడు డాకూ మహారాజ్ వరకు బ్రేకులు లేకుండా వెళుతోంది. ఈ నాలుగు సినిమాలు రు. 400 కోట్ల వసూళ్లు సాధించాయి.దీంతో నందమూరి అభిమానులు మా బాలయ్య తోపు అంటూ రెచ్చిపోతున్నారు. సీనియర్ హీరోల్లో ఈ ఘనత ఏ హీరోకు లేదు.బాలయ్య అభిమానులు మా కలెక్షన్లు ఒరిజినల్, రికార్డులు ఒరిజినల్ అనే వీడియోలను ట్రెండ్ చేస్తున్నారు. దీనికి చిరంజీవి ఫ్యాన్స్ సైతం కౌంటర్లు వేస్తున్నారు. డాకూ మహారాజ్ సినిమా హిట్ అయినా బ్రేక్ ఈవెన్ అయ్యేందుకే నానా కష్టాలు పడిందని చిరు ఫ్యాన్స్ కౌంటర్లు వేస్తున్నారు.
ఇక బాలయ్య నాలుగు సినిమాలు హిట్ అని చెప్పుకుంటున్నా ఏ ఒక్క సినిమా కూడా రు. 100 కోట్ల షేర్ రాలేదని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటు బాలయ్య అభిమానులు చిరు రీ ఎంట్రీ ఇచ్చాక వాల్తేరు వీరయ్య మినహా అన్ని సినిమాలు పెద్ద డిజాస్టర్లు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య … తమ అభిమానల హీరోల సినిమాలు… కలెక్షన్ల మధ్య రచ్చ జరుగుతోంది.
చిరు – బాలయ్య ఫ్యాన్స్ వార్… కలెక్షన్ల చిచ్చు… మొత్తం రచ్చరచ్చ..!
