ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర పుష్ప 2 సినిమా తర్వాత ఆ రేంజ్‌లో షేక్ చేస్తోన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది చావా. స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరోగా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా సాలిడ్ పాత్రలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ ఎమోషనల్ యాక్షన్ సినిమా కేవలం ఒక్క భాషలోనే తెరకెక్కి పాన్ ఇండియా వైడ్ వైరల్‌గా మారింది.ఇండియా వైడ్‌గా ఈ సినిమా తాజాగా రు. 200 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయ్యింది. వీక్ డేస్‌లోకి వచ్చినా కూడా బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోన్న ఈ సినిమా ఒక్క భాషలోనే రిలీజ్ అయినా కూడా ఈ స్థాయిలో దుమ్ము దులపడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. తాజాగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కూడా 30 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించింది. కొన్ని ఏరియాల్లో అయితే డే 1 కంటే డే 6 ఎక్కువ వసూళ్లు వచ్చాయి.
దీంతో ఈ సినిమా హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే ఈ వీకెండ్‌కు ఈజీగా రు. 300 కోట్ల నెట్ వసూళ్ల క్లబ్‌లో ఈ సినిమా ఒక్క ఇండియా నుంచే చేరిపోతుందని చెప్పాలి. ఈ సినిమా లాంగ్ రన్‌లో మరిన్ని భారీ వసూళ్లు అందుకుంటుందని బీ టౌన్ ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.