కమెడియన్ ధన్ రాజ్ నటిస్తూ… దర్శకత్వం వహించిన చిత్రం ‘రామం రాఘవం’. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ పతాకంపై ప్రభాకర్ అరిపాక సమర్పణలో పృద్వీ పోలవరపు నిర్మించారు. ఇందులో నటుడు, దర్శకుడు సముద్రఖని తండ్రి పాత్రలో కనిపించారు. ఫాదర్ అండ్ సన్ రిలేషన్స్ తో ముడిపడిన ఓ ఎమోషనల్ స్టోరీని శివప్రసాద్ యానాల అందించారు. ఓకే ఒక లోకం నువ్వే అనే ఓ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ ను అందించిన అరుణ్ చిలివేరు సంగీతం అందించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా వుందో తెలుగులైవ్స్ సమీక్షలో చూద్దాం పదండి.కథ: రామ(సముద్రఖని) గొప్ప నిజాయతీ గల ఆఫీసర్. ఆయనకు లేక లేక ఒక సంతానం కలుగుతుంది. అతని పేరు రాఘవం(ధన్ రాజ్). జులాయిగా తిరుగుతూ మద్యం, జూదానికి భానిసై చివరకు చీటింగ్ లకు కూడా పాల్పడుతూ వుంటాడు. ఇది తెలిసి తన తండ్రి రామం పోలీసులకు పట్టిస్తాడు. అప్పటికీ మార్పు రాని రాఘవ… తను బాగుపడాలంటే… తన తండ్రిని చంపితే గానీ తన జీవితం బాగుపడదని భావించి… తన మిత్రుడి(హరీషోత్తమన్) సహకారంతో లారీతో గుద్దించి చంపేయాలనుకుంటాడు. తద్వారా తన తండ్రి ఉద్యోగంలో(కారుణ్య నియామకం కింద) చేరి… విచ్చల విడిగా అవినీతి సొమ్మును సంపాధించాలని ప్లా చేస్తాడు. మరి ఈ ప్లాన్ ఫలించిందా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ.. కథనం విశ్లేషణ: ధన్ రాజ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం… తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్స్ కి అద్దం పడుతుంది. గతంలో ఇలాంటి కథతో చాలా సినిమాలు వచ్చినా… కథనం కొత్తగా వుండటం… దానికి ప్రేక్షకులను ఎంగేజ్ చేసే టెక్నికల్ వ్యాల్యూస్ కూడా తోడు కావడంతో సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. వ్యసనాలకు భానిసైన యువత… నేటి సమాజంలో ఎలాంటి పెడదోవ పడుతోంది అనేది చూపించారు. బెట్టింగులకు, మద్యానికి బానిసై… చివరకు కన్న తండ్రినే కడతేర్చడానికి ఎలాంటి దుర్మార్గాలకు పాల్పడతారనే ఇందులో గుండెల్ని పిండేసేలా తెరపై చూపించారు.ఫస్ట్ హాఫ్ లో జులాయిగా తిరుగుతున్న కుమారుణ్ని సక్రమైన మార్గంలో నడిపించడానికి ఓ తండ్రి పడే తపనను చూపించారు. అదే సమయంలో తన తండ్రి పెట్టే రిస్ట్రిక్షన్స్ ను తట్టుకోలేక… కన్న తండ్రినే కడతేర్చాలని నిర్ణయించుకునే ఓ కుమారుడి దుర్మార్గమైన ఆలోచనను ఇంటర్వెల్ బ్యాంగ్ తో చూపించి… సెకెండాఫ్ పై మంచి ఆసక్తిని రేకెత్తించాడు. ఇక ఇంటర్వెల్ తరువాత తన తండ్రిని చంపడానికి రాఘవ వేసే ప్లాన్స్ అన్నీ చాలా ట్విస్టులతో ముడిపడి ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ క్లైమాక్స్ దాకా ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి సినిమా చూసేంతలా చిత్రీకరించారు. ఇక ఆఖరులో వచ్చే సీన్ ఆడియన్స్ గుండెల్ని పిండేస్తుంది. చివరగా రామం రాఘవం… ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు.
ఈ సినిమాకి ధన్ రాజ్ అన్నీ తానై…. నడిపించారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ లాగా… మరోవైపు… ఆడియన్స్ ను మెప్పించడానికి తన నటనను చాలా బాగా చూపించారు. అతని తండ్రిగా రామ పాత్రలో సముద్రఖని వేసి మెప్పించారు. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కంటతడిని పెట్టిస్తాయి. ధన్ రాజ్ ఫ్రెండ్ పాత్రలో లారీ డ్రైవర్ గా హరీషోత్తమన్ మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు. ఆంజనేయస్వామి మాలధారణ వేసి…విలనిజం చూపించారు సునీల్. ఇదొక డిఫరెంట్ లుక్ అని చెప్పొచ్చు కమెడియన్ సునీల్ కి. థర్టీ ఇయర్స్ పృద్వీ, సోసియల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ పులి సీత కాసేపు అక్కడక్కడ కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
ధన్ రాజ్ తొలిసారిగా దర్శకత్వం వహించి… నటించి మెప్పించారు. కథనం బాగుంది. మలుపులతో కూడిన సన్నివేశాలన్నీ ఆకట్టుకుంటాయి. ఎక్కడా తొట్రుపాటు లేకుండా సీన్స్ ను తీయడంలో ధన్ రాజ్ సక్సెస్ అయ్యారు. శశి చిత్రానికి మ్యూజిక్ అందించిన అరుణ్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా సినిమాని ఎంతో ఉన్నతంగా నిర్మించారు. ఈ వీకెండ్ లో సరదాగా ఈ సినిమాను చూసేయండి.
రేటింగ్: 3