నందమూరి నటసింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. మూడు ఒకదానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. సింహా, లెజెండ్, అఖండ మూడు బ్లాక్బస్టర్.. ఇప్పుడు అఖండ సినిమాకు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం సినిమా వస్తోంది. ఈ సినిమా 14 రీల్స్ బ్యానర్ మీద తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాలో నటిస్తోన్న బాలయ్యకు రు. 38 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇది బాలయ్యకు కెరీర్ హయ్యస్ట్.. ఇక దర్శకుడు బోయపాటికి సైతం రు. 35 కోట్లు ఇస్తున్నారట. ఇది కూడా బోయపాటి కెరీర్‌లోనే టాప్ రెమ్యనరేషన్. అఖండ తర్వాత బోయపాటి స్కంధ లాంటి డిజాస్టర్ సినిమా తీసినా కూడా బోయపాటి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
దీనికి తోడు బాలయ్య – బోయపాటి అంటే సహజంగానే ఉండే క్రేజ్‌తో కూడా బోయపాటికి రు. 35 కోట్లు ఇస్తున్నారట. ఈ సినిమా బడ్జెట్ రు. 180 కోట్లు అని.. థియేటర్.. నాన్ థియేటర్ బిజినెస్ రు. 200 కోట్లు అని లెక్కలు కడుతున్నారు.
అఖండ 2 : బోయపాటికి కెరీర్ హయ్యస్ట్ రెమ్యునరేషన్… !
