నటరత్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా తాతమ్మ కళా సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన బాలకృష్ణ .. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ తండ్రిని మించిన నటుడుగా టాలీవుడ్ లోనే తనకంటూ ప్రత్యేక క్రేజ్‌ను సంపాదించుకున్నాడు .. బాలయ్య ఇండియన్ చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాల కెరీర్ ని కూడా పూర్తి చేసుకున్నాడు .. ఒకపక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పట్లతో ఎందరోకో పేదలకు వైద్యం అందిస్తున్నాడు .. ఇంకోపక్క రాజకీయాల్లో కూడా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు .. ఇలా బాలకృష్ణ చేస్తున్న సేవలను మెచ్చి భారత ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డును కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం బాలకృష్ణ టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోలలో వరస విజయాలతో దూసుకుపోతున్నాడు .. అఖండతో మొదలు ఈ సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్‌తో వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం అఖండ 2 సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే బాలయ్య వ్యక్తిగత జీవితంలో ఆయనకు కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు కూడా ఉన్నాయి .. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇటువంటి అలవాట్లు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే .. బాలయ్య షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఎంత లేటుగా షూటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చిన ప్రతిరోజూ ఉదయం మాత్రం 3. 30 నిమిషాలకు నిద్రలేస్తాడు .. ఇది బాలయ్యకు తన తండ్రి గురువు ఎన్టీఆర్ దగ్గరనుంచి నేర్చుకున్న అలవాటు .. అలాగే నిద్రలేచిన వెంటనే బాలయ్య ముందుగా భూమాతకు నమస్కారం పెడతారట .. ఆ తర్వాత స్నానం చేసి సూర్యోదయంలోపే పూజ చేసుకుంటారు. అలాగే ఒక చుట కూడా కలుస్తాడు.
ఇక బాలకృష్ణకు దైవభక్తి ఎక్కువ అన్న విషయం కూడా తెలిసిందే.. ఆయన దైవ సేవ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తే మనకోసం మనం సమయం కేటాయించుకున్నట్లే అని ఆయన నమ్ముతారు .. అందుకే ప్రతిరోజు బాలయ్య సూర్యోదయానికి ముందే పూజకి సమయం కేటాయిస్తారు .. అలాగే బాలయ్యకు తెలుగు పద్యాలు మరియు సంస్కృతంలో మంచి పట్టు ఉంది .. వీటికోసం చిన్నతనంలోనే బాలయ్య తెలుగు మాస్టర్ దగ్గర ప్రత్యేకంగా శిక్షన కూడా తీసుకున్నారు . అలాగే బాలయ్యకు ముహూర్తాలు పెట్టడంలో కూడా ఆయన ఎంతో దిట్ట. ప్రస్తుతం ఇలాంటి ప్రతిభ ఉన్న అతికొద్దీ మంది తెలుగు హీరోల్లో మన బాలకృష్ణ కూడా ఒక్కరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు .
ఉదయం నిద్ర లేవగానే బాలయ్య ఏం చేస్తాడు.. టాలీవుడ్ లోనే ఇలాంటి అలవాటు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే..!
