Moviesమెగాస్టార్‌కు విశ్వంభ‌ర ఓకే.. ఆ త‌ర్వాత ఏ సినిమా..!

మెగాస్టార్‌కు విశ్వంభ‌ర ఓకే.. ఆ త‌ర్వాత ఏ సినిమా..!

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారా సినిమాతో దర్శకుడుగా తన మార్కు చూపించుకున్నాడు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట .. ఆ వెంటనే బింబిసారా సినిమాకు సిక్వ‌ల్‌గా కళ్యాణ్ రామ్ తోనే తన తర్వాత సినిమా కూడా ఉంటుందన్న ప్రచారం గట్టిగా జరిగింది. కారణాలు ఏమైనా కానీ బింబిసారా సిక్విల్‌ పట్టాలు ఎక్కలేదు .. కళ్యాణ్ రామ్ కు వశిష్ట మధ్య గ్యాప్ వచ్చిందన్న ప్రచారం కూడా జరిగింది .. సడన్గా ఇంతలోనే మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు వశిష్ట .. చిరంజీవితో విశ్వంభర సినిమాను పట్టాలు ఎక్కించాడు .. ప్రాజెక్టుపరంగా క్రేజీ సినిమానే ఇది వాస్తవానికి ఈ సినిమా సంక్రాంతికి రావాలి కానీ చాలా ఆలస్యమైంది ..విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్న విశ్వంభర! - Andhrawatch.comయూవీ క్రియేషన్స్ వాళ్ళు చాలా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు .. ఎందుకో టీజర్ రిలీజ్ అయిన విజువల్స్ వీక్ గా ఉన్నాయన్న కామెంట్లు పడ్డాయి .. డిసెంబర్ సినిమా తర్వాత చిరంజీవి ప్రాజెక్ట్ ఏమిటన్న విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది .చిరంజీవి లైన్ లో చాలామంది టాప్ దర్శకులు ఉన్నారు. అయితే వశిష్ట సినిమా ఎవరితో ఉంటుంది అన్నదానిపై తర్జనభజనలు జరుగుతున్నాయి .. బింబిసార‌ తర్వాత రామ్ చరణ్ నుంచి వశిష్టకు పిలుపు వచ్చింది. చరణ్ కోసం ఒక కథ రెడీ చేశాడు వశిష్ట .. అది చిరంజీవితో పాటు చరణ్ కి కూడా బాగా నచ్చింది .. చరణ్ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో వశిష్టకు వెంటనే డేట్లు ఇవ్వలేకపోయాడు .. అదే టైంలో చిరంజీవి నాకు సరిపడా కథ‌ ఉందని అడగటం అప్పుడే విశ్వంభర కథ చెప్పటం అది చిరుకి నచ్చటం చకచక జరిగిపోయాయి ..director mallidi vasishta interview - Boxoffice70mm.comవిశ్వంభర తర్వాత చరణ్‌తో సినిమా ఉంటుందన్న ఫీలింగ్ లో ఉన్నాడు వశిష్ట .. అయితే ఇప్పుడు చరణ్ ఫుల్ బిజీ తన 16 , 17 సినిమాలు లాక్ అయిపోయాయి ఆ తర్వాత చరణ్ దొరుకుతాడా లేదా అన్నది మూడేళ్ల తర్వాత మాట సో ఇప్పుడు వశిష్ట మరో హీరోని వెంటనే వెతికి పట్టుకోవాలి ప్రస్తుతం వశిష్ట దృష్టి అంతా కళ్యాణ్ రామ్ పై ఉందని సమాచారం .. అయితే బింబిసారా సీక్వెల్ చేయకుండా విశ్వంభర సినిమా చేయడంతో కళ్యాణ్ రామ్ కూడా వశిష్టపై కాస్త అసహనంతో ఉన్నట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేస్తే బింబిసార 2 ఉంటుందా లేదా ఆ ప్లేస్ లో మరో ప్రాజెక్టు ఉంటుందా అన్నది చూడాలి

Latest news