Movies' గేమ్ ఛేంజ‌ర్ ' బ‌డ్జెట్‌... వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్...

‘ గేమ్ ఛేంజ‌ర్ ‘ బ‌డ్జెట్‌… వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్క‌లివే… !

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వస్తున్న సినిమాలలో.. మెగా ఫ్యామిలీ హీరో… టాలీవుడ్‌ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలీ హీరోయిన్లుగా న‌టిస్తోన్న సినిమా గేమ్ ఛేంజ‌ర్‌. ఈ సినిమా రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తోన్న వేళ ఈ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించిన కోలీవుడ్ ద‌ర్శ‌కుడు.. విల‌క్ష‌ణ న‌టుడు ఎస్‌.జె సూర్య చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.Game Changer (2025) - Movie | Reviews, Cast & Release Date - BookMyShowఓ ఇంట‌ర్వ్యూలో గేమ్ ఛేంజ‌ర్ సినిమాకు రు. 400 – 500 కోట్ల బ‌డ్జెట్ నిర్మాత దిల్ రాజు పెట్టిన‌ట్టు చెప్పారు. ఈ బ‌డ్జెట్ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే ప్ర‌తి ఒక్క‌రు షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాకు ఏపీ సహా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలిపి రు. 130 కోట్లకి పైగా ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. అంటే రు. 130 కోట్ల టార్గెట్ తో రాబోతుంది.Game Changer trailer: Ram Charan pulls off multiple looks in father-son  saga for righteousness. Watch - Hindustan Timesఇందులో ఒక్క నైజాం నుంచే 37 కోట్ల మేర బిజినెస్ జ‌రిగింది. ఇక ఆంధ్రలో రు. 70 కోట్లు .. సీడెడ్ నుంచి 20 కోట్లకి పైగా బిజినెస్ చేసిందట. ఇక వ‌ర‌ల్డ్ వైడ్ ఈ సినిమా రు. 250 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే రు. 450 కోట్ల రేంజ్ గ్రాస్ వసూళ్లు రాబ‌ట్టాల్సి ఉంటుంది. మరి ఈ మొత్తం టార్గెట్ గేమ్ ఛేంజర్ కొడుతుందో లేదో వేచి చూడాలి. థ‌మ‌న్ ఈ సినిమాకు సంగీతం అందించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news