Movies' డాకూ మ‌హారాజ్ ' బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే... బాల‌య్య...

‘ డాకూ మ‌హారాజ్ ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే… బాల‌య్య కెరీర్ రికార్డ్‌… !

నందమూరి నట‌సింహ బాలకృష్ణ నుంచి సంక్రాంతి రేసులో రాబోతున్న సినిమా డాకు మహారాజ్‌. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్బస్టర్ సక్సెస్ అందుకుంటాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ – శ్రీకర్ స్టూడియోస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా దాదాపు రు. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెర‌కెక్కింది. ఈ సినిమా ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది.Daku Maharaj: అంద‌రి దృష్టి డాకు ట్రైల‌ర్ పైనే! - Latest Telugu News |  తెలుగు వార్తలు | NRI Telugu News Paper in USA - Telugu Timesతాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కు సోషల్ మీడియాలో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య నుంచి ..నందమూరి అభిమానులు ఎలాంటి అంశాలు అయితే కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పటికే క్లోజ్ అయింది. అన్ని చోట్ల ఫ్యాన్సీ రేట్లకు ఈ సినిమా రైట్స్ డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాను నైజాంలో దిల్ రాజు పంపిణీ చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ సినిమాకు రు. 83 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.Daku Maharaj 🔥 Jai balayya.... . . . . . . . #dakumaharaj #jaibalayya  #balakrishna #nbk #balakrishna #tollywood #newfilm #tollywood #telugucinema  #cinemapichodu❣️ #2025filmsఅంటే బాక్సాఫీస్ వద్ద డాకు మహారాజ్ హిట్ అవ్వాలంటే రు. 84 కోట్ల షేర్ అందుకోవాలి. ఇక బాలయ్య కెరీర్ లోనే అత్యధిక ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకే జరగటం విశేషం. బాలయ్య – అఖండ – వీర సింహారెడ్డి – భగవంత్‌ కేసరి సినిమాలతో గ్రాస్ కలెక్షన్ల‌లో రు. 100 కోట్ల మైలురాయి దాటేశాడు. అయితే షేర్ పరంగా మాత్రం రు. 100 కోట్ల క్లబ్లో చేరలేదు. మరి డాకు మహారాజ్ .. ఆ మార్క్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news