Moviesఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమాకు టైటిల్ ప్రాబ్ల‌మ్ వ‌చ్చిందా..?

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమాకు టైటిల్ ప్రాబ్ల‌మ్ వ‌చ్చిందా..?

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అర్ధ‌రాత్రి షోల‌తో మిక్స్‌డ్ టాక్‌తో మొద‌లైన ఈ సినిమా ఏకంగా రు.400 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టి బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ మంచి వ‌సూళ్లు సాధించింది. దేవ‌ర సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా ఎన్టీఆర్ రెండు వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

Release date locked for NTR, Hrithik Roshan multistarrer 'War 2'దేవ‌ర హిట్‌తో మంచి జోష్‌లో ఉన్న ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమాను క‌న్న‌డ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ త్వరలో స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను డ్రాగ‌న్ అనే టైటిల్ ఫిక్స్ చేయాల‌ని ముందుగా అనుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు సోష‌ల్ మీడియాలో దీనిపై ర‌చ్చ లేపుతున్నారు. డ్రాగ‌న్‌ టైటిల్‌ ఎన్టీఆర్ సినిమాకు పెట్టవద్దంటూ అభిమానులు కోరుతున్నారు.Devara: Part 1 (2024) Review!! – Welcome to Moviz Ark!తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న తాజా సినిమాకు కూడా ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ కాంబోలో వస్తోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క పాన్ ఇండియా సినిమాకు అదే టైటిల్ పెడితే రిలీజ్ సమయంలో గందరగోళం అవుతుంద‌ని అభిమానులు అంటున్నారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్-నీల్ మూవీ టైటిల్‌పై మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ? చూడాలి.

Latest news