నందమూరి నటసింహం బాలకృష్ణ .. డైరెక్టర్ కొల్లు బాబి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా డాకూ మహారాజ్. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మూడు పెద్ద సినిమాల పోటీ మధ్యలో కూడా రిలీజ్ అయ్యి సెన్షేషనల్ హిట్ కొట్టింది. అలాగే బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా డాకూ మహారాజ్ రికార్డులకు ఎక్కింది. బాలయ్య గత మూడు సినిమాలు అఖండ – వీరసింహారెడ్డి – భగవంత్ కేసరి సినిమాలతో హిట్లు కొడుతున్నారు.
ఈ క్రమంలోనే డాకూ మహారాజ్ సినిమాతో మరో హిట్ కొట్టారు. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్‌తో హిట్ కొట్టినా కూడా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సెట్ చేసింది. బాలయ్య కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా ఏకంగా రు. 170 కోట్లు కొల్లగొట్టింది. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించడం విశేషం. అలాగే డాకూ మహారాజ్ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించినట్టు కూడా తెలుస్తోంది.
డాకూ మహారాజ్ సినిమాకు రు.83 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా.. రు. 86 కోట్ల షేర్ వచ్చినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెపుతున్నాయి. అయితే నైజాంతో పాటు బాలయ్యకు మంచి పట్టున్న సీడెడ్ లాంటి చోట్ల వస్తాయనుకున్న కలెక్షన్ల కంటే కాస్త తక్కువ కలెక్షన్లే వచ్చాయని తెలుస్తోంది.