టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన రీసెంట్ మూవీ ‘దేవర పార్ట్ 1’ . చాలా మిక్స్‌డ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది దేవర 1. ఈ సినిమాలో ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేశాడు. సినిమాకు టాక్ వీక్‌గా వచ్చినా కూడా వన్ మ్యాన్ షోతో దేవర పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్ బస్టర్ చేసి పడేశాడు.
ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్‌లోనే చెప్పారు. ఈ క్రమంలోనే దేవర 2 ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్ కొరటాల. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు కొరటాల టీం. ఓటీటీలో దేవర సినిమాకు కొంత వరకు నెగటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో స్క్రిఫ్ట్‌లు మార్పులు.. చేర్పులు చేస్తున్నారట కొరటాల టీం.
ఇందుకోసం కొరటాల టీం పుష్ప 2’ స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప 2 లో నార్త్ ఆడియెన్స్‌ను అమితంగా ఆకట్టుకునేలా మాస్ ఎలివేషన్లతో పాటు జాతర సీన్లు లాంటివి పెట్టారు. ఇప్పుడు దేవర 2 కోసం కూడా అలాంటి సీన్లు ప్లాన్ చేస్తున్నారట. అలా స్క్రీన్ ప్లే ఉంటేనే దేవర 2 నార్త్ ఆడియెన్స్‌కు మరింత చేరువ అవుతుందని ఆయన ఆశిస్తున్నారు.