పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ కాంబినేషన్లో వచ్చిన స్టైలిష్ సినిమా పంజా. 2012 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే మంచి స్టైలిష్ సినిమాలలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ అప్పట్లో హైలైట్ అయింది. అయితే ఇప్పుడు పంజా సినిమాకు సీక్వెల్ గా పంజా 2 ప్రస్తావన వచ్చింది. మొన్నటికి మొన్న ఎస్ జె సూర్య .. ఇప్పుడు విష్ణువర్ధన్ కుదిరితే పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ తో ఖుషి తీస్తానని సూర్య చెపితే ఇప్పుడు విష్ణువర్ధన్ అన్ని అనుకున్నట్టు కుదిరితే అఖిరాతో పంజా 2 తీస్తానని చెబుతున్నాడు.
అకీరానందన్ చాలా చార్మింగ్.. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను చాలా బాగుంటాడు అతడితో పంజా 2 సినిమా చేస్తే బాగుంటుంది.. అయితే నేను ప్లాన్ చేసే కంటే సరైన టైంలో అది అలా జరగాలని కోరుకుంటానని విష్ణువర్ధన్ తెలిపారు. పంజా కూడా పవన్ కళ్యాణ్ తో నేను ప్లాన్ చేయలేదు అలా జరిగిపోయింది.. పంజా 2 కూడా అలా జరగాలని కోరుకుంటున్నా.. ఆ ఛాన్స్ వస్తే అకీరాతో కచ్చితంగా పనిచేస్తానని విష్ణువర్ధన్ తెలిపారు. ఇక పవన్ లో తనకు నచ్చిన క్వాలిటీస్ కూడా చెప్పుకొచ్చాడు. సూటిగా మాట్లాడే వాళ్ళు అంటే పవన్ కు చాలా ఇష్టం.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి.. ఆయన అలానే ఉంటారు.. ఆయన చుట్టూ ఎప్పుడూ ఏదో పవర్ ఉన్నట్టు నాకు అనిపిస్తుందని తెలిపాడు.
అయితే ఆయనది మాత్రం చిన్నపిల్లాడి మనస్తత్వం.. ఒక ఎక్సైట్మెంట్ అయినా ఏదైనా విషయం పై స్పందించాలంటే ఎవరినైనా నమ్మాల్సి వచ్చిన చాలా జెన్యూన్ స్ట్రాంగ్ గా ఉంటారు.. పవన్ లో నాకు నచ్చిన క్వాలిటీ అదే అని విష్ణువర్ధన్ తెలిపారు. పంజా తర్వాత తెలుగు నుంచి ఈ దర్శకుడికి చాలా ఆఫర్లు వచ్చాయి.. వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తెలుగు సినిమా చేయలేదని ఈసారి తప్పకుండా తెలుగులో సినిమా చేస్తానని విష్ణువర్ధన్ చెబుతున్నాడు.