ఈ మధ్యకాలంలో సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ ..సినిమాని తెరకెక్కించడం కన్నా కూడా సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి సినిమాకి పబ్లిసిటీ రావడానికి ఎక్కువగా కష్టపడుతున్నట్లు కనిపిస్తున్నారు. మరి ముఖ్యంగా కొందరు డైరెక్టర్లు.. సినిమాని పబ్లిసిటీ పాపులారిటీ చేసుకోవడానికి రకరకాల స్టెంట్స్ కూడా ప్రయోగిస్తున్నారు. తమ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో పక్క హీరో సినిమాలకు సంబంధించి పలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్ ని కూడా టచ్ చేస్తూ వస్తున్నారు. అయితే డైరెక్ట్ అనిల్ రావిపూడి మాత్రం అలాంటి వాటికి పూర్తి వ్యతిరేకం .తన పని తాను చూసుకో పోయే టైప్. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో కామెడీ డైరెక్టర్ గా అనిల్ రావిపూడి ఒక స్పెషల్ మార్కును కూడా వేయించుకున్నారు . భగవంత్ కేసరి సినిమాతో బాలయ్యలోని సెంటిమెంట్ యాంగిల్ కూడా బయటపెట్టిన ఘనత అందుకున్నాడు . కాగా కదా రీసెంట్గా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14వ తేదీ థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . కాగా మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అన్న మూమెంట్లో సినిమాకి సంబంధించిన ఒక్కొక్క న్యూస్ బయటకు వస్తూ ఫాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుంది .
సినిమా ప్రమోషన్స్ కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో వెంకటేష్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ఎంత కష్టపడ్డారో అన్న విషయం మనం చూస్తూనే వచ్చాం . కాగా ఈ సినిమాకి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటకు వచ్చింది . ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ కూడా ఒక స్పెషల్ కేమియో రోల్ లో మెరిసారట. ఈ కేమియో రోల్ చాలా చాలా హైలెట్ గా ఉండబోతుందట . మరి ముఖ్యంగా ఐశ్వర్య రాజేష్ ..వెంకటేష్ ల మధ్య వచ్చే ఫన్నీ ఫ్యామిలీ సీన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా సిద్ధూ క్యారెక్టర్ ని అనిల్ రావిపూడి డిజైన్ చేశారట. సిద్దు కటౌట్ చూస్తుంటేనే కొందరు కామెడీగా నవ్వేస్తూ ఉంటారు . ఆయన డైలాగ్ డెలివరీ కూడా అలానే ఉంటుంది. ఇక అనిల్ రావిపూడి లాంటి కామెడీ డైరెక్టర్ చేతిలో పడితే వేరే లెవెల్ లోనే ఆ కామెడీ ఉంటుంది . దీంతో సినిమాపై వేరే లెవల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు జనాలు . కచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . అనిల్ రావిపూడి అదుర్స్ .. సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాకి పర్ఫెక్ట్ కెమియో రోల్ చేసే హీరో అంటూ ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు..!