Moviesచరిత్ర సృష్టించిన "డాకు మహారాజ్" మూవీ..బాలయ్య చిరకాల కోరిక తీరిపోయిందోచ్..!

చరిత్ర సృష్టించిన “డాకు మహారాజ్” మూవీ..బాలయ్య చిరకాల కోరిక తీరిపోయిందోచ్..!

ఇప్పుడు బాలయ్య పేరు సోషల్ మీడియాలో ఎలా మారుమ్రోగిపోతుందో మనకు బాగా తెలిసిందే. గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన “డాకు మహారాజ్” మూవీ వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలయ్య తాజాగా నటించిన సినిమానే ఈ డాకు మహారాజ్. బాలయ్య డ్యూయెల్ షేడ్స్ లో అదరగొట్టేసాడు . నానాజీ పాత్రలో పర్వాలేదు అనిపించిన .. డాకు మహారాజ్ పాత్రలో మాత్రం గూస్ బంప్స్ తెప్పించేశారు .

Daku Maharaj Review: రివ్యూ: బాలకృష్ణ ‘డాకు మహారాజ్‌’ ఎలా ఉంది?

థియేటర్లలో ఒక్కొక్క సీను పడుతుంటే నందమూరి ఫ్యాన్స్ రోమాలు నిక్కబడుచుకునేలా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు తమన్. ఈ సినిమాకి తెరపై హీరో బాలయ్య అయితే తెర వెనుక హీరో మాత్రం తమన్ అందులో నో డౌట్ 100% నిజం అంటూ నందమూరి ఫ్యాన్స్ కూడా ఓపెన్ గానే ఒప్పేసుకున్నారు. కాగా ఈ సినిమా మొదటి రోజు 30 కోట్లు కలెక్షన్స్ సాధించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇది బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ రికార్డ్స్ . ఇప్పటి వరకు బాలయ్య నటించిన అన్ని సినిమాలల్లోకి ఈ మూవీ నే తోపు.Daku Maharaj First Review: డాకు మహారాజ్ మూవీ ఫస్ట్ రివ్యూ.. బాలయ్య  బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమా? – News18 తెలుగుఇదే మూమెంట్లో బాలయ్య కెరియర్ లోని అత్యధికంగా మొదటి రోజు కలెక్షన్స్ సాధించిన టాప్ ఫైవ్ మూవీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి . కాగ గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన వీర సింహారెడ్డి ఆయన కెరియర్ లోనే ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా ఇప్పటి వరకు చరిత్రలో నిలిచిపోయింది . మొదటి రోజు 25.35 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అఖండ సినిమా మొదటి రోజు 15.39 కోట్లు షేర్ వసుళ్లు చేసింది . ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన “భగవంత్ కేసరి” సినిమా మొదటి రోజు 14.36 కోట్లు షేర్ చేసింది. ఎన్టీఆర్ బయోపిక్గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమా 7.5 కోట్లు షేర్ వసూళ్లు చేసింది . అయితే బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇప్పటివరకు హైయెస్ట్ ఓపెనింగ్స్ ఈ నాలుగు సినిమాలే టాప్ ప్లేస్ లో ఉన్నాయి . ఇప్పుడు ఆ ప్లేస్ లోకి బాలకృష్ణ నటించిన “డాకు మహారాజ్” వచ్చి చేరింది. ఫస్ట్ డే మొత్తంగా 30 కోట్లు కలెక్ట్ చేసి బాలయ్య చిర కాల కోరిక తీర్చేసింది..!

Latest news