Movies' డాకూ మ‌హారాజ్ ' సినిమాకు బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంత పెంచారంటే..!

‘ డాకూ మ‌హారాజ్ ‘ సినిమాకు బాల‌య్య రెమ్యున‌రేష‌న్ ఎంత పెంచారంటే..!

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా బ్లాక్ బస్టర్ సినిమా డాకు మహారాజ్. గత రెండేళ్ల‌కు ముందు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ప్రేక్షకులకు మంచి కిక్కిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీతో పాటు టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సాయి సౌజన్య కలిసి సంయుక్తంగా నిర్మించిన సంగతి తెలిసిందే.Daku Maharaj: డాకు టార్గెట్ ఎంతంటే.. - Latest Telugu News | తెలుగు వార్తలు  | NRI Telugu News Paper in USA - Telugu Timesఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రు. 83 కోట్ల రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమాలో నటించినందుకు గాను బాలయ్యకు 27 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అఖండ సినిమాకు బాలయ్య ఎనిమిది కోట్లు తీసుకున్నారు. వీర సింహారెడ్డికి 12 కోట్లు .. భగవంత్ కేస‌రి సినిమాకు 18 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నారు. సినిమా సినిమాకు బాలయ్య వసూళ్లు పెరుగుతున్నాయి.బాల‌య్య మార్కెట్ పెరుగుతూ వ‌స్తోంది. ఇటు అన్‌స్టాప‌బుల్ షో తో బుల్లితెరపై దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే డాకు మహారాజు సినిమాకు 27 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువ జరిగింది. సినిమాకు మంచి హిట్ టాక్ రావడంతో సినిమా కొన్న వారందరికీ లాభాలు రానున్నాయి.

Latest news