టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ మాత్రమే తమ మార్కెట్ కాపాడుకుంటూ వస్తున్నారు. చిరంజీవి రీయంట్రీ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి నటించిన సినిమాలు ఎక్కువగా డిజాస్టర్లు అవుతున్నాయి. అయినా కూడా చిరంజీవి రెమ్యునరేషన్ 55 కోట్లకు పైనే ఉంటుంది. తాజాగా విశ్వంభర సినిమాకు కూడా చిరంజీవి ఏకంగా రు. 70 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక నటసింహం బాలకృష్ణ తన కెరీర్ లోనే ఎప్పుడు లేనట్టుగా ఏకంగా నాలుగో వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలుతో దూసుకుపోతున్నారు.తాజాగా అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న బాలయ్య ఈ సినిమాలో నటిస్తున్నందుకు గాను 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే బాలయ్య వీర సింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు బాలయ్య 40 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్టు టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇక సీనియర్ హీరోలలో మిగిలిన ఇద్దరు హీరోలు నాగార్జున – వెంకటేష్ రెమ్యునరేషన్ 10 కోట్లు దాటడం లేదు.
తాజాగా సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ తన తర్వాత సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి వస్తున్నాం సినిమా లాంగ్ లో 300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధిస్తుందని ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోని వెంకటేష్ తన తర్వాత సినిమాకు 15 నుంచి 18 కోట్లు డిమాండ్ చేస్తారని టాలీవుడ్ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు వెంకీ రెమ్యునరేషన్ 10 కోట్లకు కాస్త అటు ఇటుగా ఉంటూ వస్తుంది. ఏది ఏమైనా ఒక బ్లాక్ బస్టర్ పడిందో లేదో వెంకటేష్ తన రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా పెంచేసాడని చెప్పాలి.
సంక్రాంతి బ్లాక్‌బస్టర్ దెబ్బ.. వెంకీ రెమ్యునరేషన్ పెంచేశాడే..!
