Moviesగేమ్ ఛేంజ‌ర్ ఎక్క‌డో తేడా కొడుతోంది... ఎందుకు హైప్ లేదు..?

గేమ్ ఛేంజ‌ర్ ఎక్క‌డో తేడా కొడుతోంది… ఎందుకు హైప్ లేదు..?

రామ్ చరణ్ హీరో .. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకుడు .. దిల్ రాజు నిర్మాత .. కైరా అద్వాని హీరోయిన్. దాదాపు రు. 400 కోట్ల బడ్జెట్ కానీ ఎందుకో గేమ్ ఛేంజర్ సినిమాకు ఇంకా రావాల్సిన హైప్‌ రావడం లేదు. సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వస్తోంది అంటే ఏ సినిమాకు అయినా ఎంత క్రేజీ ఉంది అని చెప్పేందుకు ఈ రోజు కొలమానం. సోషల్ మీడియా లో ట్రెండ్స్ చూస్తుంటే దాదాపు ఏ సినిమాకు ఎలాంటి క్రేజ్ ఉందో ? అర్థమైపోతుంది. కల్కి – దేవర – పుష్ప 2 వీటితో సమానమైన సినిమానే గేమ్ ఛేంజ‌ర్ ను ఇప్ప‌టి వ‌ర‌కు చూశారు. ఇది నిజం కూడా .. ! కానీ ఎందుకో వాటితో సమానమైన బ‌జ్‌ రావడం లేదు. ఎంత రేట్లు పెట్టి కొని అయినా పై మూడు సినిమాలు బాగా చూశారు. గేమ్ ఛేంజ‌ర్ సినిమా సంక్రాంతి కి వస్తోంది.

ఈ సినిమాకి కూడా 800 లేదా రు. 1000 ప్రీమియర్లు ఎన్ని పడతాయి .. తొలిరోజు రేట్లు ఎంత మేర పెంచుకుంటారు ? డే వ‌న్ కలెక్షన్ ఎంత ఉంటుంది ? అన్నది చూస్తే ఎవరికీ పెద్దగా ఆసక్తి లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సరైన పాట పడలేదు. మచ్చా మచ్చారా పాట బాగా పాపులర్ అయ్యింది. అది హీరో ఇంట్రడక్షన్ గ్రూప్ సాంగ్ మరో రొమాంటిక్ సాంగ్ వదిలారు. విజువల్స్ బాగున్న ఎక్కడ వినిపించడం లేదు. దేవర డ్యూయెట్ .. పుష్ప పాటలకు ఆఖరికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో పాటలకు కూడా చేసినట్టు రీల్స్ కనిపించడం లేదు.

Game Changer Song NaaNaa Hyraanaa: Kiara Advani And Ram Charan Romance  Against Stunning Locations | Watch - News18

మరి మిగిలిన పాటల పరిస్థితి ఎలా ఉందో ? ఎవరికీ అర్థం కావడం లేదు. అమెరికాలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అన్నది ఫ్యాన్స్ వరకు పరిచయం అవుతుంది .. కామన్ ఆడియన్స్ వరకు వెళ్ళదు. రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ అతిథిగా వ‌చ్చే ఫంక్షన్ జరిగిన తర్వాత ఏమైనా ఈ సినిమాకు హైప్‌ పెరుగుతుందేమో చూడాలి. ప్రస్తుతానికి సినిమా పరంగా వదిలిన కంటెంట్ పరంగా సోషల్ మీడియా హడావుడి చూసుకుంటే గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా రేంజ్ లో చాలా వెనకబడి ఉంది.

Latest news