టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా హరిహర వీరమల్లు. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా షూటింగ్ దాదాపు కంప్లీట్ అవుతోంది. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది.వీరమల్లు సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు నుంచో రిలీజ్ కి వస్తుందన్న టాక్ ఉంది. ఇపుడు ఫైనల్ గా ఈ సాంగ్ పై మళ్ళీ బజ్ వినిపిస్తుంది. జనవరి 1 నూతన సంవత్సరం కానుకగా ఈ ఫస్ట్ సింగిల్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాకు ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఇక ఫస్ట్ సింగిల్‌గా వచ్చే పాట స్వయంగా పవన్ ఆలపించింది కావడం మరో విశేషం. శ్రీ సూర్యా మూవీస్ బ్యానర్‌పై పవన్‌తో ఖుషి, బంగారం లాంటి సినిమాలు నిర్మించిన ఏఎం. రత్నం ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మార్చి 28న హరిహర వీరమల్లు పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కానుంది.
పవన్ న్యూ ఇయర్ గిఫ్ట్.. హరిహర వీరమల్లు నుంచి గూస్‌బంప్స్ అప్‌డేట్
