పుష్ప 2 రాకతో బాలీవుడ్లో రికార్డులు చెల్లాచెదురు అయ్యాయి. కొత్త బెంచ్ మార్కులు క్రియేట్ అయ్యాయి. ఎన్నో మైలురాళ్లు మొదలయ్యాయి. ఇప్పుడు హిందీ బాక్సాఫీస్ లో పుష్ప 2 సరికొత్త చరిత్ర సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి 700 కోట్ల రూపాయల మార్కెట్ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ అయిన 19 రోజులకు పుష్ప 2 హిందీ వెర్షన్ కు 704 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. అలా తొలిసారి రు. 700 కోట్ల మార్కు టచ్ చేసిన సినిమాగా పుష్ప 2 ఇండియన్ సినిమా చరిత్రలో రికార్డులకు ఎక్కింది.బాలీవుడ్లో అమీర్ ఖాన్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన గజినీ సినిమాతో రు. 100 కోట్ల క్లబ్ అనేది మొదలైంది. ఆ తర్వాత త్రీ ఇడియట్స్ సినిమాతో 200 కోట్ల రూపాయల క్లబ్ ను .. పీకే సినిమాతో 300 కోట్ల రూపాయల క్లబ్ లోను అమీర్ ఖానే క్రియేట్ చేశాడు. ఇక బాహుబలి 2 హిందీ వర్షన్ తొలిసారి 400 కోట్ల రూపాయల మార్క్ అందుకోవడం తో పాటు అదే ఊపులో 500 కోట్ల రూపాయల క్లబ్ కూడా క్రియేట్ చేసింది. చాలా రోజుల పాటు ఈ రికార్డు అలాగే ఉండిపోయింది. మరో సినిమా అందుకోలేదు. కేజిఎఫ్ 2 హిందీ వెర్షన్ ఈ రికార్డు దాటుతుందని అనుకున్న దాని వల్ల కూడా కాలేదు.
ఇటీవల స్త్రీ 2 సినిమా బాహుబలి 2 చేసింది. ఏకంగా 600 కోట్ల రూపాయల నెట్ వసూళ్లతో కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఈ ఘనత ఎక్కువ రోజులు నిలవలేదు. పుష్ప 2 రు. 600 కోట్లు కాదు ఏకంగా 700 కోట్ల బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇండియాలో ఉన్న ప్రతి స్టార్ హీరోకు ఇప్పుడు ఏదో పెద్ద టార్గెట్ అయినట్టు అయింది. ఈ రికార్డు చాలా రోజులపాటు ఇలాగే ఉండిపోయేలా కనిపిస్తోంది. ఏదేమైనా పుష్ప 2 దెబ్బకు బాలీవుడ్ హీరోలు సైతం కుళ్లుకుంటోన్న పరిస్థితి.
100 కోట్లు 500 కోట్లు కాదు 700 కోట్లు… తెలుగు సినిమాను చూసి కుళ్లుకుంటోందెవరు..!
