పుష్ప 2 సినిమాను ఎవరూ చూడవద్దు .. ఈ సినిమాను క్లాప్ చేస్తాం అంటూ ఓపెన్ గానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు .. అందుకోసం తాము ఏం చేయాలో తమలో తాము గట్టిగా చర్చించుకున్నారు. సమావేశాలు పెట్టుకున్నారు.. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అలాగే కొందరు జనసేన కార్యకర్తలు.. అలాగే మెగా అభిమాన సంఘాలు కూడా సినిమాను పట్టించుకోకూడదు అని రిలీజ్ కి ముందు బాగా హడావిడి చేశాయి. ఇంకా ఎన్నికలవేళ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి వైసిపి అభ్యర్థికి సపోర్ట్ చేయటాన్ని పవన్ అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదు.ఎన్నికల్లో వైసిపి ఓడిపోయి కూటమి విజయం సాధించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు మరింతగా రెచ్చిపోతున్నారు. పుష్ప 2 విషయంలో పవన్ వీరాభిమానులు నెగిటివ్గా స్పందించారు. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. అయినా కూడా పుష్ప 2 సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో పవన్ వీరాభిమానులకు పుండు మీద కారం జల్లినట్టు అయింది. పుష్ప 2 కలెక్షన్లు పవన్ అభిమానులకు నిద్ర లేకుండా చేశాయి. అంతా బాగానే ఉంది.. ఇప్పుడు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన గొడవలో అల్లు అర్జున్ అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్ టార్గెట్ చేయడానికి సరైన టైమ్.. సరైన విషయం దొరికింది.
దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు .. జనసేన కార్యకర్తలు తమతో పెట్టుకున్నందుకు అల్లు అర్జున్ తగిన శాస్తి జరిగింది .. మాతో పెట్టుకున్నాడు.. మనోడు తిక్క తీరింది అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్ లు పెడుతున్నారు.. మరికొందరు మాత్రం ఈ సంఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఎలా ఉన్నా ? ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ విషయంలో అతడి తీర్పు తగిన శిక్ష అంటూ కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో.. మరి ఇది ఎటు దారితీస్తుందో ? చూడాలి.