Moviesటాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ.. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ..!

టాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ.. హీరోయిన్ గా యంగ్ బ్యూటీ..!

నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నందమూరి ఎన్టీరామారావు వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక బాలయ్య వారసత్వాన్ని నిలబెట్టేందుకు మోక్షజ్ఞ సైతం త్వరలోనే ఇండస్ట్రీకి అడుగుపెట్టనున్నాడు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతుంది. ఇప్పటికే మోక్షజ్ఞ లుక్స్ సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి.

Mokshagna, who is about to enter Tollywood

ఇక స్టార్ హీరోలను బీట్ చేసే స్టన్నింగ్ లుక్ లో మోక్షజ్ఞ కనిపించాడు. ఇక మొన్న మధ్య అనిల్ రావిపూడి డైరెక్షన్లో బాలయ్య హీరోగా నటించిన భగవంత్ కేసరి చిత్రం షూటింగ్ సమయంలో సెట్ కి వెళ్ళిన మోక్షజ్ఞ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి లైన్ క్లియర్ అయింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం బాలకృష్ణ చాలా ప్లాన్ చేశారు.

Mokshagna, who is about to enter Tollywood

ఇక గతంలో బాలకృష్ణ మాట్లాడుతూ..” మా అబ్బాయి కూడా హీరోగా రాబోతున్నాడు. యంగ్ హీరోలా సలహాలు అతనికి కావాలి ” అని ఓ స్టేజ్ పై అన్నారు. అలాగే మోక్షజ్ఞ డెబ్యూ మూవీ సీనియర్ దర్శకుడు తేజ డైరెక్షన్లో ఉండనున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడు మరొక దర్శకుడు పేరు బయటికి వచ్చింది. టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞ తన మొదటి సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ చిత్రంలో మోక్షజ్ఞ కి జోడిగా శ్రీలీలను ఎంపిక చేసినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఎవరో ఒకరు స్పందించాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news