Moviesనెత్తిన దరిద్రమంటే ఇదే.. క‌ల్కిలో దీపికా పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్...

నెత్తిన దరిద్రమంటే ఇదే.. క‌ల్కిలో దీపికా పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్‌ ఎవ‌రో తెలుసా?

క‌ల్కి 2898 ఏడీ.. జూన్ 27న వ‌ర‌ల్డ్ వైడ్ గా విడుద‌లైన మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అశ్వినీ ద‌త్ నిర్మించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా చేస్తే.. దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా ప‌టానీ, శోభన, ప‌శుప‌తి త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు. సుమారు రూ. 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిత‌మైన క‌ల్కి చిత్రం హిట్ టాక్ ను ద‌క్కించుకుంది.

Do you know who is the Tollywood heroine who missed Deepika's role in Kalki?

తొలి రోజు నుంచి ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం బాక్సాఫీస్ వ‌ద్ద వీర విహారం చేస్తోంది. విడుద‌లైన ప‌ది రోజుల్లోనూ రూ. 800 కోట్ల రేంజ్ లో వ‌సూళ్లను కొల్ల‌గొట్టింది. బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ ఖాతాలో మ‌ళ్లీ ఆ స్థాయి హిట్ క‌ల్కితోనే ప‌డింది. ఇక‌పోతే క‌ల్కి మూవీ స్టోరీ మొత్తం బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే చుట్టూనే తిరుగుతుంది. ప్రాజెక్ట్ K యొక్క ల్యాబ్ సబ్జెక్ట్ SUM-80 అలియాస్ సుమ‌తి అనే గ‌ర్భిణీ స్త్రీ పాత్ర‌లో దీపికా న‌టించింది. ఆమె క‌డుపున పుట్టబోయే బిడ్డ కల్కిని రక్షించే లక్ష్యం నేప‌థ్యంలో క‌థ సాగుతుంది.

పూర్తి స్థాయి ఎమోష‌న‌ల్ పాత్ర‌లో దీపికా చూపించిన అభినయానికి ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. తొలి సినిమాతోనే దీపికా తెలుగు వారి హృద‌యాలు గెలుచుకుంది. అయితే తాజాగా దీపికా పాత్ర‌కు సంబంధించి ఓ షాకింగ్ మ్యాట‌ర్ తెర‌పైకి వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. సుమ‌తి పాత్ర కోసం దీపికా ప‌దుకొనే క‌న్నా ముందు టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేను అనుకున్నార‌ట‌. క‌థ‌లో అత్యంత కీల‌కమైన ఆ క్యారెక్ట‌ర్ కు పూజా బాగా సెట్ అవుతుంద‌ని నాగ్ అశ్విన్ అనుకున్నార‌ట‌.

Do you know who is the Tollywood heroine who missed Deepika's role in Kalki?

కానీ అంతకు ముందే ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వ‌చ్చిన‌ రాధే శ్యామ్ మూవీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. ఆ స‌మ‌యంలో పూజ నటనపై కూడా విమర్శలు వ‌చ్చాయి. దీనికి తోడు రాధే శ్యామ్ త‌ర్వాత బుట్ట‌బొమ్మ హిట్ ముఖ‌మే చూడ‌లేదు. ఈ అంశాల‌న్నీ ప‌రిశీలించి క‌ల్కి మేక‌ర్స్ వెన‌క్కి త‌గ్గార‌ట‌. పూజా హెగ్డేను బదుల‌గా దీపికాను ఎంపిక చేసుకున్నార‌ట‌. ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియ‌దు గానీ.. నెట్టింట మాత్రం ఈ న్యూస్‌ తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు పూజా హెగ్డేను ఉద్ధేశిస్తూ.. దరిద్రం నెత్తిన ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరని కామెంట్స్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news