Moviesపెళ్లి పీట‌లెక్కేస్తున్న డింపుల్ హయతి.. ఈ డ‌స్కీ బ్యూటీకి కాబోయే భ‌ర్త...

పెళ్లి పీట‌లెక్కేస్తున్న డింపుల్ హయతి.. ఈ డ‌స్కీ బ్యూటీకి కాబోయే భ‌ర్త ఎవ‌రంటే?

ఇటీవల సినిమా పరిశ్రమలో వరుసగా వెడ్డింగ్‌ బెల్స్ మోగుతున్నాయి. ఫిల్మ్‌ స్టార్స్ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలెక్కేస్తున్నారు. రీసెంట్ గా విలక్షణ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఇంటిది అయింది. ఇందులోనే మరొక హీరోయిన్ పెళ్లి వార్త తెరపైకి వచ్చింది. టాలీవుడ్ డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి త్వరలోనే తన సింగిల్ లైఫ్ కు ఎండ్ కార్డ్ వేసి మింగిల్ కాబోతోందని జోరుగా వార్తలు వస్తున్నాయి.

విజయవాడలో తమిళ తండ్రి, తెలుగు మాట్లాడే తల్లికి జన్మించిన డింపుల్ హయాతి.. హైదరాబాద్లో పెరిగింది. 19 ఏళ్ల వయసులో గల్ఫ్ అనే మూవీ తో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. దేవి 2 మూవీతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే డింపుల్ కు ఈ రెండు సినిమాలు గుర్తింపు తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ మూవీలో డింపుల్ హ‌యాతి చేసిన స్పెషల్‌ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది.

ఈ సాంగ్ ద్వారా తెలుగులో డింపుల్ య‌మా పాపుల‌ర్ అయింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. యురేకా, ఖిలాడి, రామబాణం, సామాన్యుడు తదితర చిత్రాల్లో నటించినప్పటికీ డింపుల్ కెరీర్ ఊపందుకోలేదు. సరైన అవకాశాలు రాకపోవడం, చేసిన సినిమాలు పరాజయం పాలవడంతో డింపుల్ ఇప్పుడు ఛాన్సుల్లేక సోషల్ మీడియాకి పరిమితమైంది. ఇక ఈ నేపథ్యంలోనే ఆమె వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుందట.

హైదరాబాద్ కు చెందిన ఒక బడా వ్యాపారవేత్తతో డింపుల్ హయాతి ఏడ‌డుగులు వేయ‌బోతోంద‌ని టాలీవుడ్ ఫిల్మ్‌ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. సదరు వ్యాపారవేత్తతో గత కొంతకాలం నుంచి డింపుల్ ప్రేమాయ‌ణం నడిపిస్తుందట. ఇప్పుడు తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం పెళ్లి చేసుకోవాలని వారు డిసైడ్ అయ్యారట. పెద్దలు కూడా అంగీకరించడంతో త్వరలోనే డింపుల్ హయాతి సదరు బిజినెస్ మెన్‌తో వైవాహిక జీవితాన్ని ప్రారంభించ‌బోతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే డింపుల్ స్పందించాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news