Moviesభార‌తీయుడు 2 ఎదుట భారీ టార్గెట్‌.. తెలుగులో ఎంతొస్తే హిట్ అవుతుంది..?

భార‌తీయుడు 2 ఎదుట భారీ టార్గెట్‌.. తెలుగులో ఎంతొస్తే హిట్ అవుతుంది..?

క‌ల్కి 2898 ఏడీ త‌ర్వాత థియేట‌ర్స్ లో సంద‌డి చేయ‌బోతున్న మ‌రో పెద్ద చిత్రం భార‌తీయుడు 2(త‌మిళంలో ఇండియ‌న్ 2). 1996లో విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసి భార‌తీయుడు చిత్రానికి కొనసాగింపుగా భార‌తీయుడు 2 మూవీని డైరెక్ట‌ర్ శంక‌ర్ రూపొందించారు. ఈ చిత్రంలో యూనివ‌ర్స‌ల్ స్టార్ కమల్ హాసన్ మెయిన్ లీడ్ లో యాక్ట్ చేయ‌గా.. సిద్ధార్థ్, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ఎస్‌జె సూర్య, బాబీ సింహా, బ్ర‌హ్మానందం, ప్రియా భవానీ శంకర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించారు.

లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యాన‌ర్ల‌పై దాదాపు రూ. 250 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిత‌మైన భార‌తీయుడు 2 చిత్రం అనేక వాయిదాల అనంత‌రం 2024 జూలై 12న పాన్ ఇండియా స్థాయిలో విడుద‌ల అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు దేశ‌వ్యాప్తంగా జోరుగా సాగుతున్నాయి. తెలుగులో ఆదివారం నాడు ప్రమోషన్స్ ను నిర్వ‌హించారు.

భార‌తీయుడు 2పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ‌టంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే స్థాయిలో జ‌రిగింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏషియ‌న్ సురేష్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఎల్ఎల్‌పి, సీడెడ్ హ‌క్కుల‌ను శ్రీల‌క్ష్మి మూవీస్ సంస్థ‌లు ద‌క్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భార‌తీయుడు 2 మూవీ సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది.

నైజాం ఏరియాలో రూ. 9 కోట్ల రేంజ్ లో బిజినెస్ జ‌ర‌గ‌గా.. సీడెడ్ లో రూ. 4 కోట్ల మేర బిజినెస్ జ‌రిగింది. ఆంధ్ర రీజన్ లో రూ. 12 కోట్లకు థియేట్రిక‌ల్ హ‌క్కులు అమ్ముడైన‌ట్లు తెలుస్తోంది. ఓవ‌రాల్గా టోట‌ల్ బిజినెస్ వ్యాల్యూ రూ. 24 కోట్లు. తెలుగులో బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిల‌వాలంటే భార‌తీయుడు 2 మూవీ రూ. 25 కోట్ల రేంజ్ లో షేర్ క‌లెక్ష‌న్స్ ను అందుకోవాల్సి ఉంటుంది. ఇది ఒక ర‌కంగా భారీ టార్గెటే అయిన‌ప్ప‌టికీ.. టాక్ అనుకూలంగా వ‌స్తే మాత్రం బ్రేక్ ఈవెన్ అవ్వ‌డం క‌ష్ట‌మైతే కాదు. ఇక‌పోతే వ‌ర‌ల్డ్ వైడ్ గా భార‌తీయుడు 2 మూవీ రూ. 75 కోట్ల టార్గెట్ లో బ‌రిలోకి దూకుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news