Moviesనమ్రత విషయంలో మహేష్ బాబు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే...

నమ్రత విషయంలో మహేష్ బాబు చేసిన బిగ్ మిస్టేక్ ఇదే .. అలా చేయకుండా ఉంటే బాగుండేదేమో..!?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ ని టార్గెట్ చేసే ఆకతాయిల లిస్ట్ ఎక్కువైపోతుంది .. ఒకటి కాదు రెండు కాదు రోజుకి ఎన్నెన్నో వార్తలు మనం వింటూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా కొంతమంది స్టార్స్ ని పదేపదే ట్రోల్ చేయడం పనిగా పెట్టుకున్నది ఒక చిల్లర బ్యాచ్ . అయితే రీసెంట్గా సూపర్ స్టార్ మహేష్ బాబును ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు . గుంటూరు కారం సినిమా టైంలో మహేష్ బాబును ఏ విధంగా ట్రోల్ చేశారో మనకు గుర్తుంది . మరి ముఖ్యంగా సూపర్ స్టార్ అన్న ఇమేజ్ ని కూడా పక్కన పెట్టేసి దారుణాతి దారుణమైన మీమ్స్ తో ఆయనను చాలా అవహేళనగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండే విధంగా మీమ్‌స్ ట్రెండ్ చేశారు.

అయితే ఇప్పుడు ఆయన పై పర్సనల్ అటాక్ చేస్తున్నారు . మహేష్ బాబు -నమ్రత విషయంలో బిగ్ తప్పు చేశాడు అంటూ ప్రచారం చేస్తున్నారు . నమ్రత ఒక స్టార్ హీరోయిన్.. మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకున్నాక ఇండస్ట్రీకి దూరమైంది . అఫ్కోర్స్ పెద్ద స్టార్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తున్నారు. కానీ మహేష్ బాబు పెట్టిన ఒకే ఒక కండిషన్ కారణంగా నమ్రత ఇండస్ట్రీలో హీరోయిన్గా చేయలేదు. నమ్రతకి కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలని ఉంటుంది .

కానీ మహేష్ బాబు ఎప్పటికప్పుడు ఆమె ఆశలను అడ్డుకుంటూనే వస్తున్నాడు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు నమ్రత లాంటి హీరోయిన్ ఇండస్ట్రీలోకి రావడం చాలా చాలా ఇంపార్టెంట్ అని .. కానీ మహేష్ బాబు తన మ్యారీడ్ లైఫ్ ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు అని ఓ రేంజ్ లో మహేష్ బాబుని సెల్ఫిష్ పర్సన్ అంటూ ట్రోల్ చేస్తున్నారు . అయితే ఏ ఇంటర్వ్యూలోను నమ్రత నన్ను బలవంతంగా మహేష్ సినిమాలో ఆపేసాడు అని చెప్పలేదు ..మరి ఈ జనాలకి ఏంటి అంత బాధ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news