Moviesకొంప ముంచేసిన విష్ణు నిర్ణయం..కన్నప్ప నుండి నయనతార అవుట్..కొత్త హీరోయిన్...

కొంప ముంచేసిన విష్ణు నిర్ణయం..కన్నప్ప నుండి నయనతార అవుట్..కొత్త హీరోయిన్ ఎవరంటే..?

ఏ ముహూర్తాన ఈ సినిమా షూట్ ని స్టార్ట్ చేశారో తెలియదు కానీ.. అప్పటినుంచి ఈ సినిమా కోసం అనుకున్న నటీనటులు వేరు ..సినిమాలో నటిస్తున్న నటిమణులు వేరు.. మంచు మనోజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమానే కన్నప్ప. ఈ సినిమా కోసం దాదాపు 100 కోట్లకు పైగానే ఖర్చు పెడుతున్నారు. అంతేకాదు పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆల్మోస్ట్ అన్ని సినిమా ఇండస్ట్రీ నుంచి కీలక నటులను ఎంపిక చేసుకుంటున్నారు .

కాగా ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు మరికొందరు స్టార్స్ నటిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరిగింది . ఆల్మోస్ట్ ఆల్ మూవీ టీం కూడా అదే విషయాన్ని అన్ అఫిషియల్ గా కన్ఫర్మ్ చేసింది . కానీ ఆఖరి మూమెంట్లో ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని తీసుకుంటున్నారు అంటూ కన్ఫామ్ చేశారు మేకర్స్ .

అయితే నిన్న మొన్నటి వరకు ప్రభాస్ శివుడు పాత్రలో కనిపించబోతున్నాడు అని పార్వతి దేవి పాత్రలో నయనతార కనిపించబోతుంది అంటూ ప్రచారం జరిగింది. ఎప్పుడైతే అక్షయ్ కుమార్ ఆ పాత్రలోకి వచ్చాడో.. అప్పుడే నయనతార ఈ సినిమా నుంచి తప్పుకోవాలి అని డిసైడ్ అయిందట. అక్షయ్ కుమార్ లాంటి ఏజ్డ్ పర్సన్ తో నటించడం ఇష్టం లేకనే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది . అంతేకాదు నయనతార స్థానంలోకి కాజల్ అగర్వాల్ వచ్చినట్లు తెలుస్తుంది. అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తూ ఉండగా కాజల్ పార్వతి దేవి పాత్రలో కనిపించబోతుందట . అంతేకాదు ప్రభాస్ నందీశ్వరుడు పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news