Movies"నా కొత్త ప్రయాణం మొదలు".. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన...

“నా కొత్త ప్రయాణం మొదలు”.. ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన మెగా డాటర్ శ్రీజ..!

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ బాగా వైరల్ అయింది. ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో మనం ఎలా వింటున్నామో.. చూస్తున్నామో ..ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా శ్రీజ – నిహారిక బ్యాక్ టు బ్యాక్ విడాకులు తీసుకోవడంతో జనాలు వాళ్ల గురించి ఏకేస్తున్నారు . అయితే మరొక పక్క వాళ్ళు మాత్రం అలాంటి ట్రోల్లింగ్ పెద్దగా పట్టించుకోకుండా లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

మనకు తెలిసిందే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు పెళ్లిలో విఫలమైంది . మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ విడాకులు తీసుకుంది . ఆ తర్వాత కుటుంబ సభ్యులు చూసిన అబ్బాయి కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుంది . అది కూడా పెటాకులు అయింది . ఇప్పుడు శ్రీజ సింగిల్గానే లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇద్దరు పిల్లలతో తన కాళ్ల మీద తన నిలబడాలని ట్రై చేస్తుంది . ఈ మధ్యకాలంలో శ్రీజ కి సంబంధించిన వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి .

ఇలాంటి క్రమంలోనే అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పింది శ్రీజ . తాను కొత్త బిజినెస్ లో అడుగు పెట్టాను అంటూ పోస్ట్ చేసింది . “ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.. ఇందులో నేను జాయిన్ అయినందుకు చాలా చాలా ధ్రిల్లింగా ఉంది” అంటూ రాసుకొచ్చింది. శ్రీజ హైదరాబాదులోని అనంత స్టూడియో పేరుతో ఓ ఫిట్నెస్ సెంటర్ ను స్టార్ట్ చేసింది . ఈ వ్యాపార ప్రారంభోత్సవానికి హీరో సందీప్ కిషన్.. రెజీనా కసాండ్రా.. శిల్పా శెట్టి హాజరై సందడి చేశారు . దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . దీంతో శ్రీజకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు మెగా అభిమానులు . ఇకనైనా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వు అంటూ సజెస్ట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news