Moviesనరాలు జివ్వుమనే అప్డేట్.. దేవర సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయేది ఆ...

నరాలు జివ్వుమనే అప్డేట్.. దేవర సినిమాలో ఐటెం సాంగ్ చేయబోయేది ఆ హీరోయినా..?

ఈ న్యూస్ విన్నాక నందమూరి ఫ్యాన్స్ ఎగిరి గంతేయడం పక్క .. నో డౌట్ .. ఇన్నాళ్లు ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాకి సంబంధించి ఎటువంటి రకాల వార్తలు వైరల్ అయ్యాయో మనం చూశాం. సినిమాకి సంబంధించిన అప్డేట్స్ బాగా బాగా ట్రెండ్ అయ్యాయి . అయితే ఈసారి ఏకంగా నందమూరి అభిమానులకు కుర్రాళ్లకు నరాలు జివ్వుమని అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ గా మారింది . ఆ వార్త విన్న నందమూరి అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు . ఇంతకీ ఆ వార్త ఏంటి అనుకుంటున్నారా..? ఇది చదవండి మీకే అర్థమవుతుంది .

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా పై నందమూరి అభిమానులు ఎలాంటి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడుతున్నాడు తారక్. ఏడు కేజీల బరువు కూడా తగ్గాడట. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే . అయితే ఈ సినిమాలో ఐటమ్ గర్ల్ గా టాప్ బ్యూటీ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇంటర్నేషనల్ గ్లోబల్ వైడ్ హాట్ టాపిక్ ట్రెండ్ అయ్యే ఫిగర్ ఈ బ్యూటీ కి ఉండడం గమనార్హం.

ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో అనుకుంటున్నారా ..? ఆమె మరి ఎవరో కాదు టాలీవుడ్ బుట్ట బొమ్మగా పాపులారిటి సంపాదించుకున్న పూజా హెగ్డే . చేతిలో పెద్దగా అవకాశాలు లేకపోయినా సరే సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ ఇప్పుడు దేవర సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చేసిందట. గతంలో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించింది . ఇప్పుడు ఆయనతో మళ్ళీ ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధపడింది . రంగస్థలం సినిమాలో జిగేలురాణి టైపులో ఈ సాంగ్ ఉండబోతుందట . ఆ కారణంగానే పూజాని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో ఫాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు . పూజ హెగ్డే ఫిగర్ కి ఎన్టీఆర్ స్టామినాకి బాగా మ్యాచ్ అవుతుంది అని ఇక రచ్చ రంబోలా కేకలు అరుపులే అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news