Moviesనాగచైతన్య జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే... సెంట్రల్ ఏసీలో సెంటర్లో మంట...

నాగచైతన్య జాతకం ఎంత దరిద్రంగా ఉందంటే… సెంట్రల్ ఏసీలో సెంటర్లో మంట పెట్టినట్లు ఉందిగా..!

పాపం ..నాగచైతన్య ఏది తలచుకున్న అది నెగిటివ్ గానే మారిపోతుంది .. ఏంటో ..? రీజన్స్ ఎవరికి అర్థం కావడం లేదు . ఈ మధ్యకాలంలో నాగచైతన్య పేరుని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అయితే నాగచైతన్య పేరు ఎలా సోషల్ మీడియాలో మారు మ్రోగి పోతుందో మనం చూస్తూనే ఉన్నాము .రీసెంట్గా నాగచైతన్యకు సంబంధించిన మరొక వార్త నెట్టింట బాగా వైరల్ గా మారింది . నాగచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా తండేల్.

ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఏ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారో కూడా మనకు తెలుసు. అలాంటి నాగచైతన్యకు ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది . అన్ని సక్రమంగా జరిగి ఉంటే నాగచైతన్య తండేల్ సినిమా దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది . అయితే అదే టయానికి ఆల్రెడీ కర్చీఫ్ వేసుకుని ఉన్నాడు ఎన్టీఆర్. దేవర సినిమాను ఎప్పుడో ఆ డేట్ కి లాక్ చేసుకుని ఉన్నాడు . ఎన్టీఆర్ తో పోటీ పడే సత్తా నాగచైతన్యకు లేదు . ఈ విషయం అందరికీ తెలిసిందే .

ఇప్పుడు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20వ తేదీ ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారట తండేల్ మేకర్స్. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది . ఈ సమయానికి కొన్ని సినిమాలు రిలీజ్ చేయడానికి సిద్ధపడుతున్నారట మేకర్స్. రాబిన్ హుడ్ సినిమా కూడా డిసెంబర్ 28 రిలీజ్ చేయాలి అని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అంతేకాదు నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను కూడా ఇదే సమయంలో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట.

అదే విధంగా పూరి జగన్నాథ్ రామ్ పోతినేని కాంబోలో వస్తున్న డబల్ ఇస్మార్ట్ సినిమాను కూడా ఇదే రోజున రిలీజ్ చేయాలి అంటూ చూస్తున్నారట. ఇవన్నీ పక్కన పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కి వాయిదా పడినట్లు తెలుస్తుంది. ఇలా ఎంతో కష్టపడి మంచి కథతో ప్రాణం పెట్టిన తండేల్ సినిమాలో నటిస్తే ఆ సినిమాని రిలీజ్ చేసే టయానికి ఇలా మిగతా సినిమాలు పోటీకొస్తున్నాయి . దరిద్రమంటే ఇదే అంటున్నారు జనాలు. మరికొందరు ఘాటుగా ట్రోల్ చేస్తున్నారు . ఇప్పుడు నాగచైతన్య పరిస్థితి సెంట్రల్ ఏసీలో సెంటర్లో మంట పెట్టినట్లు ఉంటుంది గా పాపం ఏం చేస్తాడో..? అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news