Moviesనాగచైతన్య సంచలన నిర్ణయం..సమంత తరువాత అలాంటి లక్కి ఛాన్స్ అందుకున్న స్టార్...

నాగచైతన్య సంచలన నిర్ణయం..సమంత తరువాత అలాంటి లక్కి ఛాన్స్ అందుకున్న స్టార్ హీరోయిన్ ఈమె..!?

నాగచైతన్య .. ఎప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడొ అనే విషయం ఎవరు గెస్ చేయకుండా పోతున్నారు. అసలు నాగచైతన్య ఇండస్ట్రీలో స్టార్ హీరో అని చెప్పలేము. స్టార్ హీరో టాక్ కోసం పాకులాడుతున్న ఒక హీరో అని చెప్పుకోవచ్చు . అయితే నాగచైతన్య కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించినా కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

హిట్ అయిన సినిమాలలో కూడా పెద్దగా నటన పరంగా ఆయన మార్కులు వేయించుకోలేకపోయాడు. రీసెంట్గా నాగచైతన్య నటిస్తున్న సినిమా “తండేల్”.. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ సెట్స్ పై ఉండగానే మరో మూవీకి కమిట్ అయ్యాడు నాగచైతన్య .

విరూపాక్ష సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ట్ డైరెక్టర్ గా మారిపోయిన కార్తీక్ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా కూడా పూర్తి హారర్ జోనర్ లో తెరకెక్కబోతుందట. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా చేయబోతుందట. దాదాపు 10 ఏళ్ల తర్వాత బుట్ట బొమ్మతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు నాగచైతన్య .

నాగచైతన్య – పూజ హెగ్డే కాంబోలో పదేళ్ల క్రితం ఒక లైలా కోసం అనే సినిమా వచ్చింది. మళ్ళీ ఇన్నాళ్ళకి వీళ్ళ కాంబోలో సినిమా రాబోతూ ఉండడంతో ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అంతేకాదు ఈ సినిమాలో ఏరు కోరి ఆ హీరోయిన్ పూజా నే పెట్టుకున్నాడు నాగచైతన్య అంటూ ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news