Moviesజూనియర్ ఎన్టీఆర్ కొన్న ఈ కొత్త కారు ఖరీదు తెలిస్తే ఫ్యూజులు...

జూనియర్ ఎన్టీఆర్ కొన్న ఈ కొత్త కారు ఖరీదు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి .. స్పెషాలిటీ ఏంటంటే..?

మనకు తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ కి కార్ల పిచ్చి ఎక్కువ . జనరల్గా ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. ఒకరికి వాచెస్.. మరికొందరికి డ్రెస్సెస్ ..మరికొందరికి లగ్జరీ ఐటమ్స్.. ఇలా మన ఎన్టీఆర్ కి కార్ల పిచ్చి ..ఇప్పటికే తన గ్యారేజ్లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీ కార్లు ఉన్నాయి. రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ మరో కొత్త కారు కొన్నారు . దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆర్టీవో ఆఫీస్ నుంచి బయటకు వస్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . ఆయన కొత్త కారు కొనుగోలు చేశారు అని కారు రిజిస్ట్రేషన్ చేసేందుకే అక్కడికి వెళ్లారు అని సమాచారం అందుతుంది . బ్లాక్ టీ షర్ట్ లో.. బ్లూ జీన్స్ ప్యాంట్ లో బ్లాక్ సన్ గ్లాసెస్ ధరించి చాలా సింపుల్ గా వెరీ వెరీ స్టైలిష్ గా జూనియర్ ఎన్టీఆర్ ఖైరతాబాద్ లోని ఆర్టీవో ఆఫీస్ లో కనిపించారు .

ఈ పిక్స్ ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు బాగా ట్రెండ్ చేస్తున్నారు . జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన కారు పేరు “మెస్సిడేస్ బెంజ్ మే బాచ్ ఎస్ క్లాసిక్ యస్ 580”. ఈ లగ్జరీ ప్రీమియం కారును ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారట . అందుతున్న సమాచారం ప్రకారం .. ఈ కారు ఖరీదు దాదాపు 3 కోట్లకు పైగానే ఉన్నట్లు తెలుస్తుంది. అత్యాధునిక లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారు తయారు చేశారట . ఎమర్జెన్సీ సమయంలో ఆటోమేటిక్గా అలారం కూడా మోగుతుందట . అంతేకాదు ఈ కారును చాలా కాలం నుంచి ఎన్టీఆర్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నారట . ఫైనల్లీ ఆ డే వచ్చేసింది .. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news