Movies"ఆ హీరోయిన్ ని బాగా లైక్ చేశా.. కానీ వర్క్ అవుట్...

“ఆ హీరోయిన్ ని బాగా లైక్ చేశా.. కానీ వర్క్ అవుట్ అవ్వలా..?”.. ఇన్నాళ్లకు అస్సలు విషయాని బయట పెట్టిన ఎన్టీఆర్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రక రకాల వార్తల వైరల్ అవుతున్నాయి . ఏది నిజం ఏది అబద్దం అని చెప్పడం పెద్ద గగనంగా మారిపోయింది . ఈ వార్త అబద్దమేమో..? అని అనుకునే సమయంలోనే అది నిజం అంటూ స్టార్ హీరోలు కన్ఫామ్ చేసేస్తున్నారు . అయ్యో ఈ వార్త నిజమేనా అని అనుకునే లోపే తూచ్ ఆ న్యూస్ ఫేక్ అంటూ జనాలు కు కన్ఫామ్ చేస్తున్నారు స్టార్ సెలబ్రిటీస్ . రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది. అయితే ఆ వార్త ఎంత వరకు నిజమనేది మాత్రం తెలియడం లేదు .

నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వార్త కావడంతో సోషల్ మీడియాలో జెడ్ స్పీడ్ లో ట్రెండ్ అవుతుంది. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తారక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . నిన్ను చూడాలని సినిమాతో తెరంగేట్రం చేసిన ఆయన ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు దేవర అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 లో కూడా నటిస్తున్నారు .

అంతేనా పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . కాగా ఎన్టీఆర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తాను ఒక హీరోయిన్ ని లైక్ చేశానని ..ఆ విషయం ఆమెకి తెలుసు అని ..కానీ ఆ విషయం ఆమెతో చెప్పలేకపోయాను అని.. చెప్పుకు వచ్చాడట”. 24 ఏళ్ల వయసులో అదంతా అట్రాక్షన్ అంటూ తనకు తానే సర్ధి చెప్పుకున్నారట . ఆ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి అని ..లైఫ్ అంటే ఏంటో తనకు తెలిసిందని ఎన్టీఆర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చినట్లు వార్త వైరల్ అవుతుంది. ప్రజెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news