Moviesవరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త అంత తోపా..? బ్యాక్...

వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త అంత తోపా..? బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే బుర్ర గిర్రున తిరగాల్సిందే..!

వరలక్ష్మి శరత్ కుమార్.. కోలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ బ్యూటీగా పోపులారిటీ సంపాదించుకుంది . తెలుగులో పలు సినిమాలలో కీలకపాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపుని క్రియేట్ చేసుకుంది . మరీ ముఖ్యంగా విలన్ షేడ్స్ లో వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించిన తీరు స్టార్ హీరోని సైతం మెస్మరైజ్ చేస్తుంది. ఎలాంటి పాత్రలు అయినా సరే అవలీలగా నటించగలిగే సత్తా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది .

దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటాను అంటూనే బిగ్ షాక్ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె నిన్న ముంబైలో ఘనంగా నిశ్చితార్ధం చేసుకుంది .నికోలయ్‌ సచ్‌దేవ్‌ అనే వ్యక్తిని ఆమె నిన్న ముంబైలో గ్రాండ్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది . వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అంటూ తెలుస్తుంది. కాగా వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకోబోతున్న ఆ అబ్బాయి టాప్ బిజినెస్మెన్.

అంతేకాదు ఆర్ట్ గ్యాలరీలు కూడా నిర్వహిస్తూ ఉంటాడు . ఆన్లైన్లో వివిధ రకాల పెయింటింగ్స్ కళాకృతులను విక్రయిస్తూ ఉంటాడు. నికోలయ్ తో వరలక్ష్మికి గత 14 ఏళ్లుగా పరిచయం ఉంది . వీళ్లు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ .. ఆ తర్వాత ప్రేమికులుగా మారారు . ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోతున్నారు . దీంతో సోషల్ మీడియాలో ఈ జంటకి అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు . ప్రజెంట్ వాళ్ళ ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news