Moviesఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన మనిషికి ఆ మూడే ఇంపార్టెంట్.....

ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన మనిషికి ఆ మూడే ఇంపార్టెంట్.. రౌడీ హీరో మాస్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోకి ఎలాంటి పేరు , క్రేజ్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . రౌడీ హీరోగా విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు. పరశురాం దర్శకత్వంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా వస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్లోకి రావడానికి సిద్ధంగా ఉంది .

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ ఈవెంట్స్ లో విజయ్ దేవరకొండ చురుగ్గా పాల్గొంటున్నారు . తాజాగా విజయ్ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హెల్త్ కార్డ్ డైరీ ఐడి కార్డ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు . ఆయన మాట్లాడుతూ .. “ఈ ఈవెంట్లో పాల్గొనడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నా కెరియర్ మొదటి నుంచి జర్నలిస్టులు నాతోనే ఉన్నారు . అలాగే జర్నలిస్టుల అందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు వచ్చేలా చూడాలి అని ..తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డి గారిని కొరుతున్నాను అంటూ చాలా హుందాగా మాట్లాడారు”.

“ప్రతి ఒక్కరికి జీవితంలో అవసరమైనది మూడే మూడు .. ఆరోగ్యం – ఆనందం – డబ్బు .. ఈ మూడు ఉంటే చాలు .. హెల్త్ ఇన్సూరెన్స్లు కాకుండా ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా యుటిలైజ్ చేసుకుంటున్నారు అని తెలిసి ఆనందంగా అనిపిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు”. సోషల్ మీడియాలో ప్రెసెంట్ విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news