Moviesకొడుకు కెరియర్ కోసం అలాంటి పని చేయబోతున్న సుమ.. ఇన్నాళ్లు సంపాదించుకున్న...

కొడుకు కెరియర్ కోసం అలాంటి పని చేయబోతున్న సుమ.. ఇన్నాళ్లు సంపాదించుకున్న పరువు గంగలో కలిసిపాయే..!!

సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ ఎక్కువగా కనిపిస్తున్నారు . నాన్న పేర్లు తాతలు పేర్లు చెప్పుకొని ఇన్నాళ్లు ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు . ఫర్ ద ఫస్ట్ టైం యాంకర్ సుమ కొడుకు కూడా ఒక యాంకర్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రోషన్ కనకాల హీరోగా నటించిన సినిమా బబుల్గం . అఫ్కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ అయింది . కానీ ఈ సినిమా కుర్రాళ్లను మాత్రం బాగా ఆకట్టుకునింది .

బోల్డ్ కంటెంట్ తో నేటి యువత ఏవైతే ఇష్టపడుతుందో అలాంటి విషయాలను బాగా బాగా ప్రదర్శించాడు రోషన్ కనకాల . అయితే రోషన్ కనకాల సెకండ్ సినిమా ఛాన్స్ ని మాత్రం చాలా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారట. అల్లాటప్ప డైరెక్టర్లతో కాకుండా మంచి డైరెక్టర్లతో సినిమా ఛాన్స్ అందుకునేలా చూస్తుందట తల్లి సుమ. అందుకోసం ప్రత్యేక ఫోకస్ కూడా చేసిందట . ఎవరైతే డైరెక్టర్స్ తనకి బాగా క్లోజ్ ..వాళ్లకు స్పెషల్ రిక్వెస్ట్ చేస్తుందట. హీరోయిన్ విషయంలో కూడా కొంచెం స్టార్ హీరోయిన్ గా ఉండే అమ్మాయి అయితే బెటర్ అంటూ చూస్ చేసుకుంటుందట .

దానికోసం రోషన్ కనకాల బాడీని కూడా చేంజ్ చేయడానికి కసరత్తులు చేపిస్తుందట . సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఆఫర్లు అనేటివి టాలెంట్ చూసుకొని రావాలి కానీ ఇలా పబ్లిసిటీ బ్యాక్ గ్రౌండ్ చూసుకొని వస్తాయా..? నువ్వు ఎంత కష్టపడి పైకి వచ్చావ్ ..? నీ కొడుకు కూడా అలాగే పైకి రావాలి.. కానీ ఇలా పేరు పలుకుబడితో వస్తే అది టాలెంట్ అవుతుందా..? అంటూ సుమని ట్రోల్ చేస్తున్నారు జనాలు.

ఇన్నాళ్లు కష్టపడి సంపాదించుకున్న పరువు మొత్తం ఇలాంటి పనుల ద్వారా గంగలో కలిసిపోయేలా ఉందే అంటూ చర్చించుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో సుమా యాంకరింగ్ కూడా పక్కన పెట్టేస్తూ వస్తుంది అన్న కామెంట్స్ వింటున్నాం. ముఖ్యంగా కొడుకు కెరియర్ పైన ఫోకస్ చేస్తూ వస్తుందట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news