Moviesఓరి దేవుడోయ్.. మహేష్ బాబు చేత రాజమౌళి అలా చేయించబోతున్నాడా..? ఫ్యాన్స్...

ఓరి దేవుడోయ్.. మహేష్ బాబు చేత రాజమౌళి అలా చేయించబోతున్నాడా..? ఫ్యాన్స్ కి తెలిస్తే ఊరుకుంటారా..?

ఈ వార్త తెలుసుకున్న మహేష్ అభిమానులు రాజమౌళి పై గుర్రుగా ఉన్నారు ..ఫైర్ అయిపోతున్నారు . కొందరైతే ఏకంగా ఘాటు పదాజాలంతో ట్రోల్స్ చేస్తున్నారు . రాజమౌళి అంటే క్రమశిక్షణకు మరో మారుపేరు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆయనతో వర్క్ చేసిన ఏ హీరో అయిన ముందు రాజమౌళి గురించి మీ ఒపీనియన్ ఏంటి..? అని చెప్పగానే ఫస్ట్ చెప్పేదే “రెస్పెక్ట్ , డిసిప్లేన్”.. ఆయన అనుకున్న సీన్స్ ఎక్స్ప్రెషన్స్ రాకపోతే 100 సార్లు కాదు 1000 సార్లు అయినా రీ షూట్ చేయిస్తాడు .

అంతటి మొండిగాల మనిషి రాజమౌళి . అలాంటి రాజమౌళి మహేష్ బాబుతో ఓ అడ్వెంచర్స్ ఫిలిం చేయబోతున్నాడు. ఇప్పటివరకు మహేష్ బాబు తన కెరీర్ లో ఒక్క అడ్వెంచర్స్ ఫిలిం కూడా చేయలేదు. అలాంటి సాఫ్ట్ హీరో మహేష్ తో జక్కన్న భారీ అడ్వెంచర్స్ ఫిలిం అంటే కచ్చితంగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు . ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు .

అయితే ఈ సినిమా నుంచి ఒక క్రేజీ మేటర్ లిక్ అయింది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో డూప్ లేకుండా మహేష్ బాబు రిస్కీ షాట్స్ లో స్టంత్స్ చేయబోతున్నాడట . రాజమౌళి సలహా మేరకే ఆయన ఈ విధంగా చేయబోతున్నారట . ఇది తెలిసిన మహేష్ బాబు ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలే రిస్కీ షాట్.. అది కూడా డూప్ లేకుండా రాజమౌళి దర్శకత్వంలో ఏమైనా వర్కౌట్ అయ్యే పనేనా..? అంటూ ఫైర్ అయిపోతున్నారు . ఇలాంటి సజెషన్ ఇచ్చిన రాజమౌళి పై ఫైర్ అవుతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news