Moviesశ్రీలీల కోసం మోక్షజ్ఞ అలాంటి పని చేస్తున్నాడా..? తాత పోలికలు బాగా...

శ్రీలీల కోసం మోక్షజ్ఞ అలాంటి పని చేస్తున్నాడా..? తాత పోలికలు బాగా వచ్చాయిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వెరీ వెరీ హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. ఇన్నాళ్లు మోక్షజ్ఞ చాలా సైలెంట్ అని అనుకున్నాం ..కానీ మోక్షజ్ఞలో ఇంత టాలెంట్ కూడా ఉంది అని ఇప్పుడు ఇప్పుడే బయటపడింది అంటున్నారు నందమూరి అభిమానులు. మోక్షజ్ఞ బయటపెద్దగా కనిపించడు. సరదాగా ఫ్రెండ్స్ తో తిరిగేది కూడా చాలా చాలా తక్కువ. ఇప్పటివరకు మనం మోక్షజ్ఞ ని బయట చూసింది చాలా తక్కువ .

తండ్రిలాగే చాలా రిజర్వ్డ్ గా ఉంటాడు. తండ్రికి కోపం ఎక్కువ కొడుకుకి సహనం ఎక్కువ అని ముద్దుగా మాట్లాడుకుంటూ ఉంటారు నందమూరి అభిమానులు . కాగా రీసెంట్గా మోక్షజ్ఞ -హీరోయిన్ శ్రీలీల కోసం చేసిన పని అభిమానులను ఆకట్టుకుంటుంది. శ్రీ లీల మోక్షజ్ఞ మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. భగవంత్ కేసరి సినిమా షూటింగ్ టైం నుంచి వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు అంటూ వార్తలు వినిపించాయి.

రీసెంట్గా శ్రీలీలపై సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనకు తెలిసిందే. గుంటూరు కారం సినిమాలో నటించినందుకు గాను ఆమెను అమ్మనా బూతులు తిడుతున్నారు . అయితే శ్రీ లీల పై ఇలాంటి ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదు అని.. మోక్షజ్ఞ ..ఎవరైతే ఆమెపై ట్రోల్లింగ్ చేస్తున్నారో అలాంటి పిచ్చి ట్రోలింగ్ ఆపడానికి ఫ్రెండ్స్ సహాయంతో ట్రై చేస్తున్నారట . ఈ విషయం తెలుసుకున్న శ్రీ లీల మోక్షజ్ఞకు స్పెషల్ థాంక్స్ కూడా చెప్పిందట . అడిగితే సహాయం ఎవరైనా చేస్తారు అడగకుండా సహాయం చేసే వాడే రియల్ ఫ్రెండ్ అంటూ మోక్షజ్ఞ ను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నందమూరి అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news