Moviesవామ్మో..సైలెంట్ గా కనిపించే వెంకటేష్ టోటల్ ఆస్తి అన్ని వేల కోట్లా.....

వామ్మో..సైలెంట్ గా కనిపించే వెంకటేష్ టోటల్ ఆస్తి అన్ని వేల కోట్లా.. మామూలు బిగ్ షాట్ కాదుగా..!

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉంటారు . అయితే ఫ్యామిలీ హీరో అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది వెంకటేష్ . విక్టరీని తన ఇంటి పేరుగా మార్చుకున్న విక్టరీ వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వన్ ఆఫ్ ద హీరోల్లో బడా హీరో . ఒకప్పుడు వెంకటేష్ సినిమాలు ఎలా ఆడేవో మనకు తెలిసిందే. అంతేకాదు ఆయన సినిమాలను చూడడానికి లేడీస్ కూడా థియేటర్స్ కు పరుగు పరుగున వెళ్లేవారు .

కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో వెంకటేష్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. విక్టరీ వెంకటేష్ ఆస్తుల డీటెయిల్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఎక్కడ కూడా పెద్దగా లగ్జరీయస్ గా కనిపించని వెంకటేష్ ఆస్తుల రికార్డులు చూస్తే మాత్రం కళ్ళు జిగేల్ అనాల్సిందే. సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకునే వెంకటేష్ డాక్టర్ డి రామానాయుడు కొడుకు అని అందరికీ తెలిసిందే .

ఆయన వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఫుడ్ బిజినెస్ ల లో వచ్చిన లాభాలు ఆయనను కోటీశ్వరుడు గా మార్చేశాయి . ఒక్క రాజకీయాల్లో తప్ప అన్ని విషయాలలో వేలు పెట్టే వెంకటేష్ టోటల్ ఆస్తి 2245 కోట్లకు పైగానే ఉన్నాయట . టాలీవుడ్ లోనే రెండో అతిపెద్ద సంపన్నుడిగా వెంకటేష్ నిలిచారట . నాగార్జున కన్నా ఎక్కువగా ఆస్తులు ఉన్నాయని.. కానీ బయటకు చెప్పుకోవడం లేదు అని ఓ న్యుస్ వైరల్ అవుతుంది. హైదరాబాదులో వెంకీకి లగ్జరీ హోం కూడా ఉంది . బెంగళూరులో ఓ ఫామ్ హౌస్ కూడా ఉంది . ఇదే కాకుండా రామానాయుడు స్టూడియో తో పాటు ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది . వైజాగ్ లో కూడా ఓ స్టూడియో ఉంది . వీటితోపాటు లగ్జరీ కార్లు బైకులు, వామ్మో ఒకటారెండా ఎన్నెన్నో ..చెప్పుకుంటూ పోతుంటే వస్తూనే ఉంటాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news