Moviesకెరియర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ .....

కెరియర్ లో ఫస్ట్ టైం అలాంటి పాత్రలో కనిపించబోతున్న ప్రభాస్ .. రెబల్ అభిమానులకు రోమాలు నిక్కబొడుచుకునే న్యూస్ ఇది..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆరడుగుల అందగాడిగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకటి కాదు రెండు కాదు కోట్లాదిమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ క్రేజీ హీరో ప్రెసెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీబిజీగా ముందుకు దూసుకెళ్తున్నాడు . సలార్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రభాస్ ప్రెసెంట్ నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో కల్కి సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు .

ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు రెబల్ అభిమానులు . ఈ సినిమా అయిపోయిన వెంటనే సలార్ 2 ను.. అదే విధంగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు డార్లింగ్ ప్రభాస్ . రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ఓ ఈవెంట్లో పాల్గొని ప్రభాస్ పై సంచలన కామెంట్స్ చేశారు . సినిమా పై క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

“ఇప్పుడు నేను ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న స్పిరిట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాను. మీరందరూ అనుకున్నట్టు ఇది హారర్ మూవీ కాదు.. ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్గా మన డార్లింగ్ కనిపించబోతున్నాడు . కచ్చితంగా రెబల్ అభిమానులకి ఈ సినిమా పిచ్చిపిచ్చిగా నచ్చేస్తుంది . డార్లింగ్ లోని మరో యాంగిల్ నేను ఈ సినిమాలో బయట పెట్టబోతున్నాను” అంటూ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు . ఇప్పటివరకు మనం డార్లింగ్ ని ఎప్పుడు కూడా పోలీస్ గెటప్ లో చూడలేదు . ఫర్ ద ఫస్ట్ టైం కెరియర్ లో ఇలాంటి గెటప్ లో కనిపించబోతున్నాడు . దీంతో రెబల్ అభిమానులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news