Moviesఅనిల్ రావిపూడి - వెంకటేష్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా..? మళ్ళీ...

అనిల్ రావిపూడి – వెంకటేష్ సినిమా టైటిల్ ఏంటో తెలుసా..? మళ్ళీ అదే “సెంటిమెంట్” ని ఫాలో అవుతున్నట్లు ఉన్నారే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ రీసెంట్గా నటించిన సినిమా సైంధవ్ . ఈ సినిమా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . భారీ డిజాస్టర్ టాక్ మూట కట్టుకునింది. ఇంకా చెప్పాలి అంటే వెంకటేష్ కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తీసుకొచ్చింది . ఇప్పుడు ఎలాగైనా సరే వెంకటేష్ హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే వెంకటేష్ తన నెక్స్ట్ సినిమాను మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కమిట్ అయ్యాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

కాగా వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ఎఫ్2 – ఎఫ్3 సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి . వీళ్లిద్దరు కాంబోకి మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి . ముచ్చటగా మూడోసారి వీళ్ల కాంబోలో సినిమా అంటే కచ్చితంగా అదే రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు అభిమానులు . ఈ సినిమాకి టైటిల్ “సంక్రాంతికి వస్తున్నాం” అంటూ ఫిక్స్ చేశారట . రిజిస్ట్రేషన్ కూడా చేయించేసారట.

అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందట . ఈ సినిమాలో ఆయనకు జోడిగా త్రిష నటించబోతున్నట్లు తెలుస్తుంది . ఆ తర్వాత ఈ సినిమాలో మరో ఫన్నీ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది అని.. అది ఇండస్ట్రీలో ఉండే స్టార్ సీనియర్ హీరో చేయబోతున్నాడు అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. చూద్దాం మరి ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news