Moviesఆ హీరో ఆనందం కోసం .. అలాంటి పని చేస్తున్న...

ఆ హీరో ఆనందం కోసం .. అలాంటి పని చేస్తున్న సాయి పల్లవి.. అమ్మడులో మస్తు షేడ్స్ ఉన్నాయ్ రోయ్..!

సాయి పల్లవి సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు చెప్తే ఊగిపోయే జనాలు ఎక్కువ మందే ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో .. ఆ రేంజ్ లో ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే క్రేజీ పాపులారిటీ దక్కించుకుంది ఈ బ్యూటీ . ప్రెసెంట్ సాయి పల్లవి తన సిస్టర్ మ్యారేజ్ పనుల్లో బిజీగా ఉంది . అంతేకాదు మరొక పక్క సినిమాల్లోనూ బిజీ బిజీగా ముందుకు దూసుకెళ్తుంది.

నాగచైతన్య నటిస్తున్న తండ్రి సినిమాలో మొదటి హీరోయిన్గా నటిస్తుంది సాయి పల్లవి . ఈ సినిమాలో బుజ్జి తల్లి పాత్రలో కనిపించబోతుంది సాయి పల్లవి. ఈ సినిమాలో చాలా నాచురల్ గా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ఫస్ట్ లుక్ ఆధారంగా తెలుస్తుంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమా ఎలాగైనా హిట్ అవ్వాలి అని నాగచైతన్య ఖాతాలో బంపర్ ఆఫర్ పడాలి అని తమది లక్కీ పెయిర్ అని ప్రూవ్ చేసుకోవాలి అని.. సాయి పల్లవి బాగా కష్టపడుతుందట .

అందుకే ఈ సినిమా కోసం తనకు రాని ఉత్తరాంధ్ర భాషను కూడా నేర్చుకుంటుందట . ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకుంటుందట. ఇది తెలుసుకున్న అభిమానుల షాక్ అయిపోతున్నారు. ఎందుకు సాయి పల్లవికి నాగచైతన్య అంటే అంత అభిమానం ..?అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఒక మెట్టు దిగజారిపోయి అమ్మడులో మస్తు షేడ్స్ ఉన్నాయి.. ఏ హీరోకి తగ్గినట్టు ఆ హీరో దగ్గర బిహేవ్ చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news