Moviesఆఖరికి..వెడ్డింగ్ కార్డ్ లోను కాపీనా..? స్టార్ హీరో పెళ్లి పత్రికను డిట్టో...

ఆఖరికి..వెడ్డింగ్ కార్డ్ లోను కాపీనా..? స్టార్ హీరో పెళ్లి పత్రికను డిట్టో దింపేసిన రకుల్ ప్రీత్ సింగ్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ఫిబ్రవరి 21న గ్రాండ్గా తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కబోతుంది . దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . మూడు రోజులపాటు వీళ్ళ పెళ్లి గోవాలో ఘనంగా జరగబోతుంది . ఫిబ్రవరి 21న వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు రకుల్ – జాకీ ఫైనల్లీ పెళ్లి బంధంతో ఒకటి అవ్వాలని డిసైడ్ అయ్యారు .

ఈ క్రమంలోని పెళ్లికి తమదైన స్టైల్ లో వెడ్డింగ్ డెస్టినీను కూడా ప్లాన్ చేసుకున్నారు . కాగా రీసెంట్గా రకుల్ ప్రీత్ సింగ్ వెడ్డింగ్ కార్డ్ కి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ నెట్టింట బాగా వైరల్ గా మారాయి . ఫిబ్రవరి 21న బుధవారం రకుల్ ప్రీత్ సింగ్ జాకి భగ్నాని పెళ్లి జరగబోతున్నట్లు ఈ పెళ్లి పత్రిక ఆధారంగా తెలుస్తుంది. ఈ వెడ్డింగ్ కార్డ్ చాలా వెరైటీగా అనిపిస్తుంది . కార్డు చుట్టూ కొబ్బరి చెట్లతో ..గోవా లొకేషన్స్ .. గోవా అందాలను బాగా డిజైన్ చేశారు .

అంతేకాదు ఓపెనింగ్ కార్డ్ నీలం- తెలుపు రంగులో ఉండడం చూడడానికి ఆకర్షణీయంగా అనిపిస్తుంది . అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూసిన జనాలకు ఓ కొత్త డౌట్ వచ్చేసింది. ఈ వెడ్డింగ్ కార్డ్ ని ఎక్కడో చూసినట్లు ఉన్నామే అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఫైనల్లీ ఇది అటు ఇటుగా వరుణ్ తేజ్ వెడ్డింగ్ కార్డ్ లా ఉంది అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు . వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి లు కూడా తమ వెడ్డింగ్ కార్డును ఇలాంటి ధీమ్ తోనే డిజైన్ చేయించుకున్నారు . ఇప్పుడు వరుణ్ పెళ్లి కార్డును కాపీ కొట్టింది రకుల్ అంటూ దారుణంగా ఏకేస్తున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news