News100 కాదు 1000 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో సినిమా చేయను.....

100 కాదు 1000 కోట్లు ఇచ్చిన ఆ హీరోతో సినిమా చేయను.. తెగేసి చెప్పేసిన నయనతార..ఎందుకంటే..?

నయనతార .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ అందాల ముద్దుగుమ్మ . అబ్బో ఒకటా రెండా అమ్మడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . సౌత్ ఇండియాలోనే క్రెజియస్ట్ హీరోయిన్ అంటూ ట్యాగ్ చేయించుకున్న నయనతార .. ఒక్కొక్క సినిమాకి 10 కోట్లు రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తూ ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది .

జవాన్ సినిమాతో మరింత స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న నయనతార ప్రజెంట్ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తుంది . 1000కోట్లు ఇచ్చిన ఆ హీరోతో నటించను అని చెప్పి కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది నయనతార. 100 కోట్లు కాదు 1000 కోట్లు ఇచ్చిన సరే ఆ హీరోతో సెకండ్ కూడా నటించను అంటూ తెగేసి చెప్పేసిందట నయనతార . ఆ హీరో మరెవరో కాదు అరుణ్ శర్వాళ్.. 50 ఏళ్లు దాటిన తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈయన బిజినెస్మేన్ గా కోట్లు సంపాదించాడు.

2002లో వచ్చిన ది లెజెండ్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు . ఆయన మీద ఎన్ని రకాల మీమ్‌స్ ట్రోల్ అయ్యాయో మనం చూసాం . చేసింది చాలా తక్కువ సినిమాలు .. హిట్ కొట్టింది మరి తక్కువ.. అయితే ఈయనతో సినిమాలో నటించే ఆఫర్ వస్తే నయనతార చచ్చిన చేయను అంటూ చెప్పుకొచ్చిందట . అంతేకాదు 100 కోట్లు ఇచ్చిన చేయను అంటూ తెగేసి చెప్పిందట. అయితే ఎందుకు నయనతార అలా చెప్పింది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు . వీళ్ళకి ఏవైనా గొడవలు ఉన్నాయా ..? అనే విధంగా చర్చించుకుంటున్నారు జనాలు . మొత్తానికి భలే ఇరుక్కునేసింది నయనతార..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news