Moviesఅదే జరిగితే ప్రభాస్ కెరియర్ సంకనాకిపోయిన్నట్లే.. ఆ దేవుడే దిగి వచ్చిన...

అదే జరిగితే ప్రభాస్ కెరియర్ సంకనాకిపోయిన్నట్లే.. ఆ దేవుడే దిగి వచ్చిన కాపాడలేడా..?

తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ ప్రభాస్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు పరోక్షకంగా ఆయన అభిమానులు హర్ట్ అయ్యేలా ఉన్నాయి అంటున్నారు జనాలు . బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోయిన ప్రభాస్ రీసెంట్ గానే సలార్ పార్ట్ వన్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . పోనీలే ఎలాగోలా హిట్ అందుకున్నాడు మళ్ళీ పవర్ఫుల్ కం బ్యాక్ ఇచ్చాడు అని ఆనందపడే లోపే ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అభిమానులకి మింగుడు పడడం లేదు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో ..ఆయన హీరోగా చేస్తేనే సినిమాలు చూడాలి అని ఫాన్స్ భావిస్తూ ఉంటారు .

అఫ్ కోర్స్ ఏ అభిమానికైనా ఆ ఆలోచన ఉండడం తప్పులేదు . అయితే ప్రభాస్ మాత్రం మంచు విష్ణు హీరోగా నటిస్తున్న “కన్నప్ప” సినిమాలో శివుడి పాత్రలో కేమియో రోల్ చేయబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . పరోక్షకంగా విష్ణు కూడా దీనిని కన్ఫామ్ చేసేసాడు . మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న మంచి సంబంధం కారణంగానే మొహమాటంతో ప్రభాస్ ఈ కేమియో రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు అంటున్నారు అభిమానులు . అయితే ప్రభాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని తెలియడంతో సినిమాకి ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ఆది పురుష్ లో శ్రీరాముడి పాత్రలో కనిపించిన రెబల్ స్టార్ కన్నప్ప సినిమాలో శివుడు పాత్రలో కనిపించబోతున్నాడు అన్న ప్రచారం ఊపొందుకుంది.

అంతేకాదు పార్వతీదేవిగా నయనతార నటించబోతుందట. అయితే ఇక్కడే అభిమానులకి పెద్ద సమస్య వచ్చి పడింది . ఈ మధ్యకాలంలో స్టార్ హీరోస్ కేమియో రోల్స్ చేస్తుంటే.. అవి అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి రజనీకాంత్ లాల్ సలాం ..దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ . ఈ సినిమా చూసి రజనీకాంత్ ఫ్యాన్సీ మండిపడ్డారు . అంతకుముందు శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో పవన్ కళ్యాణ్ కూడా అలాంటి తప్పే చేశాడు. లాస్ట్ ఇయర్ సల్మాన్ ఖాన్ నటించిన “కిసికి భాయ్ కిసి కా జాన్ ” సినిమాలో వెంకటేష్ అదే తప్పు చేశారు . రామ్ చరణ్ హీరోగా నటించిన “బ్రూస్ లీ” సినిమాలో చిరంజీవి కూడా అదే తప్పు చేశాడు .

ఈ సినిమాలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి . అయితే ఇప్పుడు ప్రభాస్ మంచు విష్ణు సినిమాలో కెమియో రోల్ చేస్తున్నాడు అని తెలియడంతో ఫాన్స్ బాధపడిపోతున్నారు . ఈ సినిమా ఫ్లాప్ అయితే వచ్చిన సక్సెస్ మొత్తం సంక నాకి పోతుంది అని ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు బాసు అంటూ మండిపడుతున్నారు . ఫ్రెండ్షిప్ కోసం ఏమైనా చేస్తావా..? ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఆలోచించవా ..?అంటూ ఫైర్ అయిపోతున్నారు . చూద్దాం మరి లాల్ సలాం రేంజ్ లో కన్నప్ప సినిమా ఫ్లాప్ అవుతుందా..? లేక చరిత్రను తిరగరాస్తు ప్రభాస్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయబోతున్నాడో తెలియాలి అంటే కన్నప్ప రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news