Moviesబిగ్ బ్రేకింగ్:"ధనుష్ తో విడాకులు తీసుకుంది అందుకే".. ఐశ్వర్య రజనీకాంత్ సంచలన...

బిగ్ బ్రేకింగ్:”ధనుష్ తో విడాకులు తీసుకుంది అందుకే”.. ఐశ్వర్య రజనీకాంత్ సంచలన ప్రకటన..!!

సినిమా ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలను మనం ఎక్కువగా చూస్తున్నాం. మరీ ముఖ్యంగా పెళ్లయిన సంవత్సరం కి విడాకులు తీసుకుంటున్న జంటలు ఉన్నారు.. అలాగే పెళ్లయి 17 ఏళ్లైన తర్వాత విడాకులు తీసుకుంటున్న జంటలు ఉన్నారు . ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయం మాత్రం బయటపడడం లేదు . గతంలో అభిమానులను కంటతడి పెట్టించిన విడాకుల న్యూస్ ఐశ్వర్య రజినీకాంత్ – ధనుష్ .

కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ధనుష్ – ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నారు . అప్పటినుంచి ఎంతో బాగా చక్కగా చూసుకుంటూ వచ్చారు. వీళ్ల పెళ్లయి 17 ఏళ్ల అయింది .ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు . సడన్గా ఓ రోజు మేము విడాకులు తీసుకుంటున్నాం అంటూ ప్రకటించడంతో అభిమానుల గుండెలు బద్దలైపోయాయి. అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకుంటున్నారు అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ లేదు.

తాజాగా ఆమె డైరెక్ట్ చేసిన లాల్ సలాం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన విడాకులపై నోరు విప్పింది. “గత రెండేళ్లుగా ఒంటరితనంతోనే ఉన్నాను.. ఇప్పుడు ఆ ఒంటరితనమే బెస్ట్ ఫ్రెండ్ .. ఒంటరితనంతోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాను .. నేను గ్రహించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడే బ్రెయిన్ బాగా చురుగ్గా పనిచేస్తుంది. మనం సురక్షితంగా ఉండగలం అంటూ మనకు నమ్మకం కలిగిస్తుంది. ఈ ఏకాంతం నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు పిల్లల కోసం బ్రేక్ తీసుకున్నాను.. కానీ ప్రపంచం చాలా చాలా వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది.. అసలు టైమే తెలియడం లేదు .. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలని కోరుకుంటున్నాను.. జీవితాన్ని ఒంటరిగా లాక్కు రావడమే నాకు చాలా ఈజీగా ఉంటుంది. దీంతో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . ధనుష్ ఐశ్వర్యల మధ్య బాగా పెద్ద గొడవ జరిగిందని ఆ కారణంగానే ఆమె ఈ విధంగా మాట్లాడుతుంది అని జనాలు భావిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news