Moviesతూచ్.. బన్నీతో కాదు ఆ క్రేజీ హీరోతోనే బోయపాటి సినిమా ఫిక్స్.....

తూచ్.. బన్నీతో కాదు ఆ క్రేజీ హీరోతోనే బోయపాటి సినిమా ఫిక్స్.. చరిత్ర తిరగ రాసే కాంబో ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న బోయపాటి శ్రీను పరిస్థితి ప్రజెంట్ ఎలా ఉందో మనకు తెలిసిందే. స్కంద ఫ్లాప్ తర్వాత ఆయనపై హ్యూజ్ ట్రోలింగ్ జరిగింది . బోయపాటి డైరెక్షన్ అంటే ఇదా..? అంటూ జనాలు వ్యంగ్యంగా కౌంటర్ చేశారు . అయితే అవన్నీ తట్టుకున్న బోయపాటి శ్రీను తన నెక్స్ట్ సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ తెలుస్తుంది . రీసెంట్గా ఆయన అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపించాయి.

ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు అంటూ కూడా టాక్ వినిపించింది . అయితే ఆ సినిమా తర్వాత అఖండ 2 కూడా తెరకెక్కించబోతున్నాడు అంటూ మరో ప్రచారం ఊపందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు కూడా బడా స్టార్స్ తో సినిమా అంటే బోయపాటి కెరియర్ సెటిల్ అయిపోయినట్లే అనుకున్నారు . అంతేకాదు మధ్యలో సూర్యతో కూడా సినిమా అంటూ ప్రచారం చేశారు .

ఫైనల్లీ బోయపాటి శ్రీను వీళ్లతో కాదు టాలీవుడ్ క్రేజీ హీరోతో సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ఇన్సైడ్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు విజయ్ దేవరకొండ . విజయ్ దేవరకొండ రౌడీ హీరో బోయపాటి మాస్ డైరెక్షన్ . వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు . ఇలాంటి క్రేజీ కాంబో సెట్ అయితేనే కెవ్వు కేక అంటున్నారు జనాలు . ఈ సినిమా సెట్ అవ్వాలి అని త్వరగా అఫీషియల్ ప్రకటన రావాలి అని కోరుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news