Moviesబాల‌య్య సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ క్రేజీ హీరో... ఎవ్వ‌రూ ఊహించ‌లేరు...!

బాల‌య్య సినిమాలో విల‌న్‌గా టాలీవుడ్ క్రేజీ హీరో… ఎవ్వ‌రూ ఊహించ‌లేరు…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస విజ‌యాల‌తో దూసుకు పోతున్నారు. అఖండ‌, వీర‌సింహారెడ్డి, తాజాగా భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలు సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో మూడు ద‌శాబ్దాల త‌ర్వాత బాల‌య్య‌కు తొలి హ్యాట్రిక్ ప‌డింది. ప్ర‌స్తుతం బాల‌య్య త‌న 109వ సినిమాను బాబి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య 110వ సినిమా కూడా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలోనే ఉంటుంది.

వీరిద్ద‌రి కాంబోలో ఇప్ప‌టికే వ‌చ్చిన సింహా, లెజెండ్‌, అఖండ మూడు సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు నాలుగోసారి వీరి కాంబినేష‌న్ రిపీట్ అవుతోంది. ఈ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విల‌న్ పాత్ర గురించి ఓ అదిరిపోయే న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. టాలీవుడ్‌లో హీరోగా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా, విల‌న్‌గా ర‌క‌ర‌కాల పాత్ర‌ల‌తో మెప్పిస్తోన్న న‌టుడు శివాజీ.

కొంత కాలంగా రాజ‌కీయాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటూ.. సినిమాల‌కు కాస్త దూరంగా ఉంటున్నాడు. కొద్ది నెల‌ల క్రితం బిగ్‌బాస్ షో ద్వారా మ‌ళ్లీ లైమ్‌లైట్‌లోకి వ‌చ్చాడు. చాలా గ్యాప్ త‌ర్వాత శివాజీ వెండితెర మీద ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని తానే స్వ‌యంగా క‌న్‌ఫార్మ్ చేశాడు. అయితే ఏ సినిమా అన్న‌ది మాత్రం క్లారిటీ ఇవ్వ‌లేదు. శివాజీ స‌న్నిహితులు చెపుతోన్న దాని ప్ర‌కారం బోయ‌పాటి శీను సినిమాలో శివాజీ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌.

బోయ‌పాటి త‌న త‌ర్వాత సినిమా బాల‌య్య‌తో చేస్తున్న‌ట్టు క్లారిటీ ఉంది. ఇటు శివాజీ కూడా బోయ‌పాటి సినిమాలో విల‌న్ పాత్ర అంటే.. శివాజీ చేయ‌బోయే విల‌న్ పాత్ర‌.. బాల‌య్య సినిమాలోనే అని తేలిపోయింది. జ‌గ‌ప‌తిబాబు లాంటి న‌టుడినే లెజెండ్ సినిమాతో విల‌న్‌ను చేసి అదిరిపోయే రీ ఎంట్రీ లైఫ్ ఇచ్చాడు బోయ‌పాటి.. ఇప్పుడు బాల‌య్య‌ను ఢీ కొట్టే విల‌న్‌గా శివాజీ న‌టిస్తే… శివాజీ కెరీర్‌కు రీ ఎంట్రీలో అదిరిపోయే ఊపు వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news