Movies"సలార్" లో ప్రభాస్ కేవలం గొడ్డు కారం మాత్రమే తినడానికి కారణం...

“సలార్” లో ప్రభాస్ కేవలం గొడ్డు కారం మాత్రమే తినడానికి కారణం ఇదే.. ఏం మెలిక పెట్టావ్ రా ప్రశాంత్ నీలా..!!

సలార్ ..రిలీజ్ అయ్యి 15 రోజులు దాటేస్తున్న సరే ఇంకా ఇండస్ట్రీని ఈ సలార్ ఫీవర్ వదలట్లేదు. రెబెల్ ఫ్యాన్స్ లో నరా నరాళ్లోకి ఎక్కేసింది ఈ సలార్ మూవీ. బాహుబలి తర్వాత అలాంటి క్రేజీ హిట్ సలార్ సినిమా ద్వారానే అందుకున్నాడు ప్రభాస్ . సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు ఇప్పటికి ట్రెండ్ అవుతున్నాయి అంటే కారణం ప్రభాస్ అని చెప్పక తప్పదు . రీసెంట్గా సలార్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ని అభిమానులు తెగ ట్రెండ్ చేస్తున్నారు .

సలార్ సినిమాలో ప్రభాస్ ఎక్కడా కూడా మామూలు గా తిండి తిన్నట్టు కనిపించడు. కేవలం గొడ్డుకారంతోనే తింటున్నట్లు మనకి చూపిస్తాడు ప్రశాంత్ నీల్. అయితే ఎందుకు ప్రభాస్ గొడ్డుకారంతోనే అన్నం తింటున్నాడు ..??అన్న విషయం ఫ్యాన్స్ కనిపెట్టేశారు . ప్రభాస్ అమ్మగారు బొమ్మ కత్తి చూపిస్తేనే గజగజ వణికిపోయి ఆ కత్తి పక్కన పడేసే వరకు ప్రభాస్ ని వదల్లేదు. అలాంటిది ఇంట్లో కాయకూరలు కట్ చేయాలి అంటే కత్తులు ,కత్తిపీటలు ఉండాలి..

అవి చూస్తే మళ్ళీ ప్రభాస్ ఎక్కడ తనలోని వైల్డ్ యాంగిల్ బయట పెడతాడు అన్న భయంతోనే ఇంట్లో అసలు కూరే వండకుండా కేవలం గొడ్డుకారంతోనే ఆయనకు అన్నం పెడుతుంది అన్న క్లారిటీ కి వచ్చారు అభిమానులు .ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది . మరి ప్రశాంత్ నీల్ అనుకున్న కథకు ప్రశాంత్ నీల్ పెట్టిన ట్విస్ట్ కు ఇదే కరెక్ట్ ఆన్సర్ ..అవునో కాదో ఆయనే చెప్పాలి. ఈ సినిమా బాక్స్ ఆఫిస్ రికార్డులను బద్ధలు కొట్టేసింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news