Moviesహాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ పాప..మన మహేశ్ బాబు కి...

హాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఈ పాప..మన మహేశ్ బాబు కి ఏం అవుతుందో తెలుసా..?

అవంతిక వందనపు.. ఈ పేరు చెప్తే జనాలు గుర్తుపట్టడానికి కచ్చితంగా టైం తీసుకుంటారు. పేరు చెప్పగానే ఎవరో ఆవిడ అని ఖచ్చితంగా ఆలోచిస్తారు . అయితే బ్రహ్మోత్సవం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అమ్మాయి అంటే మాత్రం కొంతమంది గుర్తుపట్టొచ్చు . ఫోటో చూస్తే మాత్రం చాలా మంది గుర్తుపడతారు . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయి పేరే అవంతిక వందనపు. బ్రహ్మోత్సవం ,కృష్ణగాడి వీర ప్రేమ గాధ, ప్రేమమ్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకునింది ఈ తెలుగు అమ్మాయి .

అంతేకాదు అజ్ఞాతవాసి , రారండోయ్ వేడుక చూద్దాం, సినిమాల్లో కూడా నటించింది . ఇలా పలు తెలుగు తమిళ్ సినిమాలలో నటించిన ఈ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసి పడేస్తుంది. అవంతిక ఫ్యామిలీ అమెరికా వెళ్ళాక అక్కడే సెటిల్ అవ్వడంతో అక్కడే నటనపై ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా పలు సినిమాలో నటించడం మొదలుపెట్టింది . మొదట హాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అవంతిక ఆ తర్వాత హాలీవుడ్లో స్పిన్ అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసింది .

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఆ తర్వాత సీనియర్ గర్ల్ అనే సినిమాలో ముఖ్యపాత్ర చేసింది . ఈ సినిమా కూడా హాలీవుడ్ ని ఊపేసింది . అవంతిక మెయిన్ లీడ్ గా తెరకెక్కిన సినిమా జనవరి 12న హాలీవుడ్లో రిలీజ్ అయింది . ప్రస్తుతం ఈ సినిమా అక్కడ సెన్సేషన్ సృష్టిస్తుంది . దీంతో అవంతిక పేరు మారుమ్రోగిపోతుంది . తెలుగు ప్రేక్షకులు మహేష్ బాబు సినిమాలో కనిపించిన ఆ పాపేనా ఈ అమ్మాయి అంటూ ఆశ్చర్యపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news