Movies"100 జన్మలు ఎత్తిన ఆ ఎన్టీఆర్ సినిమాకి సీక్వెల్ రానే రాద్దు..గుర్తుపెట్టుకోండి".....

“100 జన్మలు ఎత్తిన ఆ ఎన్టీఆర్ సినిమాకి సీక్వెల్ రానే రాద్దు..గుర్తుపెట్టుకోండి”.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తుంది . ఆల్రెడీ హిట్ అయిపోయిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ చేయడం ఆల్రెడీ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ గా మళ్లీ ఇంకొక సినిమాను తెరకెక్కించడం ఈ మధ్యకాలంలో ఈ రెండు విషయాలను మనం బాగా గమనిస్తున్నాం. అయితే చాలామంది స్టార్ హీరో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కెరియర్ లో బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమాలకు రీమిక్ కావాలి అంటూ డైరెక్టర్ ల ను డిమాండ్ చేస్తున్నారు .

రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ నటించిన “రాఖీ” సినిమాకు సీక్వెల్ కావాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు . తాజాగా రెస్పాండ్ అయిన డైరెక్టర్ కృష్ణవంశీ ..”1000 జన్మలెత్తినా సరే రాఖీ సినిమాకి సీక్వెల్ రాదు అని ..రాఖీ సినిమా ఒక్కటే ఉంటుంది అని ..అది అభిమానులకు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోతుంది అని.. మళ్లీ మళ్లీ ఆ సినిమాలకు సీక్వెల్ తీసి సినిమా పేరుని చెడగొట్టమని చెప్పుకొచ్చారు”.

ప్రెసెంట్ కృష్ణవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కృష్ణవంశీ చెప్పింది నిజం. కొన్ని కొన్ని సినిమాలకు రీమేక్ లు అస్సలు బాగోవు.. ఉన్న పేరు చెడగొట్టుకోవడం తప్పిస్తే మరి దేనికి పనికిరావు ..రాఖీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఎన్టీఆర్ నటన పర్ఫామెన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఛార్మి – ఇలియానా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా తెరకెక్కింది…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news